
సంచలన చిత్రం `కేజీఎఫ్ చాప్టర్ 1`. సైలెంట్‌గా వచ్చి మోన్‌స్టర్‌లా బాక్సాఫీస్ వద్ద చలరేగి వసూళ్ల వర్షం కురిపించింది. యష్ హీరోగా నటించిన ఈ చిత్రం అతన్ని పాన్ ఇండియా స్టార్‌ని చేసింది. సైలెంట్‌గా వచ్చి దేశ వ్యప్తంగా సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి కొనసాగింపుగా ప్రస్తుతం `కేజీఎఫ్ చాప్టర్ 2` చిత్రం రూపొందుతోంది. 20 శాంతం మినహా చిత్రీకరణ మొత్తం పూర్తయింది.
కరోనా వైరస్ కారణంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. ఈ నెల 26న బ్యాలెన్స్ షూటింగ్‌ని మొదలుపెట్టబోతున్నామంటూ చిత్ర సహ నిర్మాత ఇటీవల వెల్లడించారు. ఆ ప్రకారమే ఈ బుధవారం ఈ చిత్ర షూటింగ్ పునః ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రకాష్‌రాజ్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ప్రకాష్ రాజ్‌పై కీలక సన్నివేశాల్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఫొటోల్ని తాజాగా దర్శకుడు ప్రశాంత్‌నీల్, ప్రకాష్ రాజ్ షేర్ చేశారు. కొంత వారమం తరువాత మళ్లీ షూటింగ్ చేస్తున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించడం పలవురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కేజీఎఫ్ సెట్‌లో ప్రకాష్‌రాజ్ ఏంటని అంతా అవాక్కవుతున్నారు. ఈ పాత్ర గురించి అసలు చర్చేజరగలేదే ఎలా వచ్చిందని ఆరాతీస్తున్నారు. రాఖీ పాత్రని ఎలివేట్ చేసే క్యారెక్టర్‌లో సీనియర్ జర్నలిస్టుగా సీనియర్ నటుడు అనంత్ నాగ్ నటించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఆయన పార్ట్ 2 నుంచి తప్పుకున్నారట. ఆ స్థానంలో ప్రకాష్‌రాజ్‌ని దర్శకుడు ఎంపిక చేసుకున్నాడని, వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాలంటే దర్శకుడు వివరణ ఇవ్వాల్సిందే.