
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. అటు మంచు విష్ణు ప్యానెల్, ఇటు ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ ఎన్నికలకు సాధారణ ఎన్నికల కలరింగ్ ఇచ్చారు. ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో ఈరోజు చేసిన పోస్ట్ ఆసక్తికరంగా ఉంది. “సాయాలు, చందాలు, ఉచితాలతోనే మనం బ్రతుకుదామా? ఆల్ లైట్స్ యాక్షన్ లతో పనిచేస్తూ జీవిద్దామా? అడుగు, ఆలోచన, ఆచరణ, మా కోసం, మా సభ్యుడి క్షేమం కోసం” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసాడు.
ఇంకా ప్రెస్ మీట్ లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణుపై విమర్శలు చేసాడు. రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఈ ఎన్నికలలో వారు ఎందుకు తలదూరుస్తున్నారని ప్రకాష్ రాజ్ మండిపడ్డాడు. ఈ సందర్భంగా ఏపీ మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలతో తమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
అయితే మంచు విష్ణు మాటిమాటికీ జగన్ పేరుని ప్రస్తావించడంపై ప్రకాష్ రాజ్ మండిపడ్డారు. మరోవైపు మంచు విష్ణు ఇండస్ట్రీలోని పెద్దలందరి సపోర్ట్ ను తీసుకుంటున్నారు. అక్టోబర్ 10న మా ఎన్నికలు జరుగుతాయి.
#MAAElections ..సాయాలు, చందాలు,ఉచితాలతోనే
బ్రతుకుదామా ???
ఆల్ లైట్స్ ,,యాక్షన్ లతో
పనిచేస్తూ జీవిద్దామా..??
అడుగు, ఆలోచన, ఆచరణ…
“మా”కోసం ,మా సభ్యుడి క్షేమంకోసం https://t.co/h7b6XaXQyC pic.twitter.com/x9B4oWsh6j— Prakash Raj (@prakashraaj) October 4, 2021