Homeటాప్ స్టోరీస్ఒరిజినల్ రెబెల్ స్టార్ అంటే మరి ప్రభాస్ ఏంటి మంచు విష్ణు?

ఒరిజినల్ రెబెల్ స్టార్ అంటే మరి ప్రభాస్ ఏంటి మంచు విష్ణు?

ఒరిజినల్ రెబెల్ స్టార్ అంటే మరి ప్రభాస్ ఏంటి మంచు విష్ణు?
ఒరిజినల్ రెబెల్ స్టార్ అంటే మరి ప్రభాస్ ఏంటి మంచు విష్ణు?

మంచు విష్ణు ఈసారి మా ఎలక్షన్స్ లో పోటీ చేస్తోన్న విషయం తెల్సిందే. ముందు ఏకగ్రీవం అనుకుని బరిలోకి దిగానని అయితే వేరే వాళ్ళు కూడా పోటీలోకి వచ్చారు, ఇక ఏదొకటి తేల్చుకుంటానని మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. చడీచప్పుడు లేకుండా నిర్వహించుకోవాల్సిన ఎన్నికలను ఏ రాజకీయ ఎన్నికలకు తీసిపోని విధంగా నిర్వహిస్తున్నారు. అటు మంచు విష్ణు కానీ ప్రకాష్ రాజ్ కానీ ప్రెస్ మీట్స్ పెట్టి, టీవీలలో ఇంటర్వ్యూలు ఇచ్చి సామాన్య ప్రజలకు ఇదేదో భారీ పోటీ, రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య జరిగేది అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారు.

ఇదిలా ఉంచితే మంచు విష్ణు ఈసారి గెలుపు కోసం తన సర్వశక్తులూ ఒడ్డుతున్నాడు. ప్రకాష్ రాజ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాడు. అలాగే ఇండస్ట్రీలోని పెద్దల ఆశీస్సులు తీసుకుంటున్నాడు. ఇదివరకు సూపర్ స్టార్ కృష్ణను కలిసి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్న మంచు విష్ణు నిన్న రెబెల్ స్టార్ కృష్ణం రాజునూ కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు.

- Advertisement -

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేసి ఇచ్చిన క్యాప్షన్ వివాదాస్పదంగా మారింది. “ఒరిజినల్ రెబెల్ స్టార్ బ్లెస్సింగ్స్ తీసుకున్నాను” అని క్యాప్షన్ జతచేయగా ప్రభాస్ అభిమానులు దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణంరాజు ఒరిజినల్ అయితే, మరి ప్రభాస్ ఏంటి? సోషల్ మీడియాలో ఏదైనా షేర్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All