Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ అక్క‌డ విల్లా కొంటున్నాడా?

ప్ర‌భాస్ అక్క‌డ విల్లా కొంటున్నాడా?

Prabhas to buy a villa in los angeles for fulfil Krishnam raju`s dream?
Prabhas to buy a villa in los angeles for fulfil Krishnam raju`s dream?

ఫ‌ల‌క్ నుమా ప్యాలెస్ సాయం సంధ్య వేళ‌… సిటీ మొత్తం క‌నిపించే వ్యూ వున్న ప్ర‌దేశంలో కూర్చుని ఫ్యామిలీతో డిన్న‌ర్ చేయాల‌ని చాలా మంది మ‌ధ్య త‌ర‌గ‌తి వారు కోరుకుంటుంటారు. అయితే హీరో యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పెద‌నాన్న కృష్ణంరాజుకూ అలాంటి కోరికే ఒక‌టి మిగిలిపోయింద‌ట‌. హాలీవుడ్ స‌మీపంలో… ఓ విల్లా.. అందులో ప్ర‌భాస్‌తో డిన్న‌ర్ చేయాల‌ని కృష్ణంరాజు డ్రీమ్ అట‌. ఈ విష‌యాన్ని ఆయ‌న ఇటీవ‌లే బ‌య‌ట‌పెట్టారు.

పెద‌నాన్న కృష్ణంరాజు అంటే ప్ర‌భాస్‌కు విప‌రీత‌మైన అభిమానం. ఆయ‌న కోరిక అంటే ప్ర‌భాస్ కూడా ముచ్చ‌ట‌ప‌డ‌తారు. అధిక ప్రాధాన్య‌త‌నిస్తారు కూడా. ఆయ‌న డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేయ‌డానికి ప్ర‌భాస్ కూడా రెడీ అవుతున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే లాస్ ఏంజిల్స్‌లో ఓ ఖ‌రీదైన విల్లాని తీసుకోబోతున్నార‌ని ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ క్రేజ్ `బాహుబ‌లి`తో స్కై హైకి చేరిన విష‌యం తెలిసిందే. ఆ క్రేజ్‌ని అంత‌ర్జాతీయ స్థాయిలో నిల‌బెట్టుకోవాల‌ని ప్ర‌భాస్ తాజాగా అడుగులు వేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.

- Advertisement -

రాధాకృష్ణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `రాధేశ్యామ్‌` చిత్రాన్ని చేస్తున్న ప్ర‌భాస్ తాజాగా పాన్ ఇండియా స్థాయికి మించి తెర‌పైకి రానున్న రెండు భారీ చిత్రాల్ని బ్యాక్ టు బ్యాక్ అంగీక‌రించి టాలీవుడ్ బిగ్గీస్‌ని, ఆడియ‌న్స్‌ని, అభిమానుల్ని షాక్ కు గురిచేసిన విష‌యం తెలిసిందే. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో సైన్స్ ఫిక్ష‌న్‌ని అంగీక‌రించిన ప్ర‌భాస్ ఆ వెంట‌నే బాలీవుడ్ ద‌ర్శ‌కుడు ఓం రౌత్ ద‌ర్శ‌‌క‌త్వంలో బ‌హు భాషా చిత్రంగా `ఆది పురుష్` చిత్రాన్ని ప్ర‌క‌టించిన అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేశాడు. ఈ సినిమాల‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ స్టేట‌స్‌పై క‌న్నేసిన ప్ర‌భాస్ త్వ‌ర‌లోనే త‌న పెద‌నాన్న డ్రీమ్‌ని ఫుల్ ఫిల్ చేయబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All