Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ మ‌రో షాకివ్వ‌బోతున్నాడా?

ప్ర‌భాస్ మ‌రో షాకివ్వ‌బోతున్నాడా?

ప్ర‌భాస్ మ‌రో షాకివ్వ‌బోతున్నాడా?
ప్ర‌భాస్ మ‌రో షాకివ్వ‌బోతున్నాడా?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మ‌రోసారి షాకివ్వ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌త మంగ‌ళ‌వారం భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ `ఆది పురుష్‌` చిత్రాన్ని ప్ర‌క‌టించి షాకిచ్చిన ప్ర‌భాస్ త్వ‌ర‌లో అలాంటి షాక్‌నే ఇవ్వ‌బోతున్నార‌ట‌. ప్ర‌భాస్ న‌టిస్తున్న తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ 40 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకుంది. ఇదిలా వుండ‌గానే ప్ర‌భాస్ యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో భారీ చిత్రాన్ని ప్ర‌క‌టించారు.

ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఓం రౌత్‌ద‌ర్శ‌క‌త్వంలో టిసిరీస్ సంస్థ దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్ తో రామాయ‌ణ గాధ నేప‌థ్యంలో రూపొందించ‌నున్న `ఆది పురుష్‌` చిత్రాన్ని ప్ర‌క‌టించారు. వ‌చ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం కాబోతోంది. 2022లో విడుద‌ల కానుంది. ఇదిలా వుండ‌గా తాజాగా ప్ర‌భాస్ మ‌రో క్రేజీ బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌బోతున్న‌ట్టు తెలిసింది.

- Advertisement -

బాలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూస‌ర్ ఆదిత్య చోప్రా ప్ర‌భాస్‌తో భారీ చిత్రాన్ని నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. ధూమ్ సిరీస్ లో భాగంగా ఈ సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది. ఈ చిత్రం కోసం హృతిక్ రోష‌న్‌ని అనుకున్న ఆదిత్య చోప్రా ఆ స్థానంలో ప్ర‌భాస్‌ని తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. `రాధేశ్యామ్‌` పూర్తి కాకుండా ప్ర‌భాస్ మ‌రో ప్రాజెక్ట్‌ని అంగీక‌రిస్తాడా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All