
ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ట్రిపుల్ ట్రీట్ రెడీ అవుతోందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభాస్ పుట్టిన రోజు ఈ నెల 23న రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన నుంచి మూడు సర్‌ప్రైజ్‌లు రాబోతున్నాయట. ప్రస్తుతం ప్రభాస్ `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన కీలక ఘట్టాల చిత్రీకరణ కోసం టీమ్ ఇటీవలే ఇటలీ బయలుదేరి వెళ్లింది. ఇంత వరకు దీని నుంచి ఎలాంటి టీజర్ లేదు. ఫస్ట్ లుక్ ని మాత్రం వదిలారు.
బర్త్‌డే రోజున టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దీని కోసం చాలా రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి యువీ టీమ్‌కి మధ్య వార్ జరుగుతోంది. దీనిపై యువీ టీమ్ ఇటీవల వివరణ కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సైన్స్ ఫిక్షన్‌కి సంబంధించిన సర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ని రివీల్ చేయబోతున్నారట.
ఇక ఈ రెండు చిత్రాలతో పాటు `ఆదిపురుష్` నుంచి కూడా ఓ ట్రీట్ వుండబోతోందని తెలిసింది. రామాయణ గాధ ఆధారంగా ఈ చిత్రాన్ని ఓమ్ రౌత్ రూపొందించబోతున్న విషయం తెలిసిందే. టీ సిరీస్ త్రీడీలో కొత్త పంథాలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయబోతున్నారని ఇప్పటికే ఈ మూవీ గ్రాఫిక్స్ కోసం ఏకంగా భారీగా ఖర్చు చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నారు.