Homeటాప్ స్టోరీస్`ఆదిపురుష్‌`లో సీత‌గా అనుష్కే అని ఫిక్స‌య్యారా?

`ఆదిపురుష్‌`లో సీత‌గా అనుష్కే అని ఫిక్స‌య్యారా?

`ఆదిపురుష్‌`లో సీత‌గా అనుష్కే అని ఫిక్స‌య్యారా?
`ఆదిపురుష్‌`లో సీత‌గా అనుష్కే అని ఫిక్స‌య్యారా?

వెండితెర‌పై ఓ జంగ హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటే ఆ జంట మ‌రోసారి తెర‌పై క‌నిపించాల‌ని ఫ్యాన్స్ మ‌ళ్లీ మ‌ళ్లీ కోరుకుంటుంటారు. త‌మ అభిమాన జంట క‌లిసి న‌టిస్తే చూడాల‌ని ఎక్జైట్ అవుతుంటారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, అనుష్క ఫ్యాన్స్ కూడా ఇదే ఎక్జైట్‌మెంట్‌తో వున్నారు. `బాహుబ‌లి`, మిర్చీ వంటి హిట్ చిత్రాల్లో హిట్ పెయిర్‌గా నిలిచిన ప్ర‌భాస్ – అనుష్క జోడి మ‌ళ్లీ తెర‌పై సంద‌డి చేయాల‌ని కోరుకుంటున్నారు.

అలా కోరు కోవ‌డ‌మే కాకుండా ఫ్యాన్ మెయిడ్ పోస్ట‌ర్ల‌తో త‌మ కోరిక‌ని బ‌య‌ట‌పెడుతున్నారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న చిత్రం `రాధేశ్యామ్‌`. ఈ మూవీ త‌రువాత ప్ర‌భాస్ మ‌రో రెండు చిత్రాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. నాగ్ అశ్విన్ చిత్రంతో పాటు బాలీవుడ్ దర్శ‌కుడు ఓమ్ రౌత్ రూపొందించ‌నున్న `ఆది పురుష్‌`. త్రీడీ లో అత్యంత భారీ స్థాయిలో రామాయ గాధ నేప‌థ్యంలో ఈ సినిమా రూపొంద‌నుంది.

- Advertisement -

ఇందులో రావ‌ణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్నారు. సీత పాత్ర కోసం చాలా మంది పేర్లు వినిపించాయి. అయితే అనుష్క పేరు తెర‌పైకి రావ‌డంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. దీంతో అనుష్క సీత పాత్ర‌లో న‌టిస్తే `ఆది పురుష్‌` ఎలా వుంటుందో ఊహిస్తూ ఫ్యాన్స్ ఓ ఫ్యాన్ మేడ్ పోస్ట‌ర్‌ని రెడీ చేసి సోష‌ల్ మీడియాలో వ‌దిలారు. ఇప్ప‌డ‌ది వైర‌ల్గా మారింది. ఎంత‌గా అంటే ఈ పోస్ట‌ర్ చూస్తూ ప్ర‌భాస్‌, ద‌ర్శ‌కుడు ఓమ్ రౌత్ సీత పాత్ర‌కు అనుష్క‌నే ఎంపిక చేసుకునేంత‌. మ‌రి అది జ‌రుగుతుందో లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All