Homeటాప్ స్టోరీస్నాలుగో సినిమానూ మొదలుపెట్టేసిన ప్రభాస్

నాలుగో సినిమానూ మొదలుపెట్టేసిన ప్రభాస్

నాలుగో సినిమానూ మొదలుపెట్టేసిన ప్రభాస్
నాలుగో సినిమానూ మొదలుపెట్టేసిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు సూపర్ బిజీగా ఉన్న నటుడు. ఇప్పటికే ప్రభాస్ నటిస్తోన్న మూడు సినిమాలు ప్రొడక్షన్ లో ఉన్నాయి. రాధే శ్యామ్, సలార్, ఆది పురుష్ సినిమాలు షూటింగ్ దశల్లో ఉన్నాయి. రాధే శ్యామ్ షూటింగ్ దాదాపు పూర్తవ్వగా సలార్, ఆది పురుష్ చిత్రాల షూటింగ్స్ అవ్వడానికి ఇంకా చాలా సమయమే పడుతుంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ తన నాలుగో చిత్రాన్ని కూడా మొదలుపెట్టేశాడు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు ఓటు వేసిన విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ ఈరోజు నుండి మొదలైంది. కోవిడ్ నేపథ్యంలో చాలా నార్మల్ గా సినిమాను మొదలుపెట్టేసారు.

- Advertisement -

బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో ప్రముఖ పాత్ర పోషించనున్న విషయం తెల్సిందే. మరో 4-5 రోజుల పాటు హైదరాబాద్ లో జరిగే ఈ షెడ్యూల్ లో అమితాబ్, ప్రభాస్ తో కలిసి షూట్ లో పాలుపంచుకుంటాడు. దీపికా పదుకోన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All