Homeటాప్ స్టోరీస్అప్పుడు అమితాబ్ ; ఇప్పుడు అక్షయ్

అప్పుడు అమితాబ్ ; ఇప్పుడు అక్షయ్

అప్పుడు అమితాబ్ ; ఇప్పుడు అక్షయ్
అప్పుడు అమితాబ్ ; ఇప్పుడు అక్షయ్

సౌత్ ఇండియన్ స్టార్ ధనుష్, బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, బాలీవుడ్ స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాకు “ఆత్రంగి రే” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఇక ఈ టైటిల్ కి అర్ధం “మనసు మరియు బుద్ధి కి మధ్య జరిగే సంఘర్షణ”. ఇది నాలుగేళ్ల క్రితం బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్ సినిమా అయిన “వాజిర్” లో స్వయంగా ఆయన పాడిన పాట లిరిక్స్. గతంలో ధనుష్, అమితాబ్ సర్ తో కలిసి “షమితాబ్” అనే సినిమా చేసారు. ఆ సినిమా బాలీవుడ్ లో ఇప్పటికీ ఒక సెన్సేషన్. ఇప్పుడు స్వయంగా బిగ్ బి టైటిల్ తో ఈ సినిమా రావడం ఒక రకమైన పాజిటివ్ వైబ్స్ కలిగిస్తోంది.

తను వెడ్స్ మను లాంటి యూనీక్ సినిమాలు తీసిన ఆనంద్ ఎల్ రాయ్ ఈ సినిమాకు దర్శకుడు. జాతీయ అవార్డు గ్రహీత అయిన రైటర్ హిమాన్షు శర్మ ఈ సినిమా స్క్రిప్ట్ ను లాక్ చేసారు. గతంలో ఆనంద్ ఎల్ రాయ్ ధనుష్ తో కలిసి “రన్ జానా” అనే సినిమా చేసారు. బాలీవుడ్ లో విలక్షనమైన సినిమాలు తీసే డైరెక్టర్ గా ఆనంద్ ఎల్ రాయ్ కు పేరుంది. ఇక ఈ సినిమాకు ఎ.ఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తున్నారు. సినిమా అనౌన్స్మెంట్ కు సంబంధించి ఇప్పటికే ఆయన ఇచ్చిన మ్యూజిక్ మూవీ లవర్స్ ని ఫిదా చేసేసింది. ఇక తనదైన పెర్ఫార్మెన్స్ తో ఏ క్యారెక్టర్ ని అయినా నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్ళే అక్షయ్ కుమార్ ఈ సినిమాలో అందరికీ ఒక స్వీట్ సర్ప్రైజ్. వచ్చే ఏడాది అంటే ఫిబ్రవరి 14 2021 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All