Homeటాప్ స్టోరీస్విజయ్, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ తో పూజ హెగ్డే బిజీ

విజయ్, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ తో పూజ హెగ్డే బిజీ

విజయ్, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ తో పూజ హెగ్డే బిజీ
విజయ్, ప్రభాస్ సినిమాల షూటింగ్స్ తో పూజ హెగ్డే బిజీ

పూజ హెగ్డే బిజియస్ట్ యాక్ట్రెస్ అని చెప్పవచ్చు. ఈ భామ వివిధ ఇండస్ట్రీలలో వరస సినిమాలతో బిజీగా ఉంది. దాదాపు మూడు నెలల పాటు షూటింగ్స్ జరగక ఇంట్లోనే ఉండిపోయిన పూజ హెగ్డే ఇప్పుడు మళ్ళీ బిజీగా మారింది. మొన్నటి నుండి రాధే శ్యామ్ షూటింగ్ లో తిరిగి పాల్గొంటోంది పూజ. రాధే శ్యామ్ ఆఖరి షెడ్యూల్ జరుగుతోంది.

ఈ చిత్రంతో పాటే తన తమిళ సినిమాకు సంబంధించిన పనులను కూడా మొదలుపెట్టేసింది. రీసెంట్ గా పూజ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. డ్యాన్స్ రిహార్సల్స్ లో పాల్గొంటున్నాను, బీస్ట్ కోసం అని పేర్కొంది పూజ హెగ్డే.

- Advertisement -

ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్స్ ను ఒకేసారి కొనసాగించనుంది. బీస్ట్ విజయ్ నటిస్తోన్న తమిళ మూవీ. నెల్సన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమాలు కాకుండా ఈ భామ చేతిలో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ కూడా ఉండడం విశేషం. తెలుగులో ఆచార్య, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కూడా ఉన్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All