Homeటాప్ స్టోరీస్ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!
ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న హైవోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌లార్‌`. ఉర్దూ ప‌దాన్ని తీసుకుని ఈ చిత్రానికి టైటిల్‌గా పెట్టారు. `స‌లార్‌` అంటే ర‌క్ష‌కుడు.. యోధుడు అని అర్థం. `కేజీఎఫ్‌` ఫేమ్ ప్ర‌శాంత్ నీల్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే చిత్రీక‌ర‌ణ మొద‌లైన ఈ చిత్రాన్ని హోంబ‌లే ఫిలింస్ బ్యాన‌ర్‌పై `కేజీఎఫ్‌` ప్రొడ్యూస‌ర్ విజ‌య్ కిరగందూర్ నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే.

శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ప్ర‌భాస్ అభిమానుల‌కు గుడ్ న్యూస్ చెప్పిన‌ట్టు తెలిసిందే. ఇటీవ‌లే గోదావ‌రిఖ‌ని స‌మీపంలోని రామ‌గుండం కోల్మైన్స్‌లో ఈ చిత్రానికి సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల చిత్రీక‌ర‌ణ ప్రారంభించారు. ఇందులో ప్ర‌భాస్‌కి ప్ర‌త్య‌ర్థిగా విజ‌య్ సేతుప‌తి క‌నిపిస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

ఇదిలా వుంటే ఈ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ లేదా అక్టోబ‌ర్ వ‌ర‌కు పూర్తి చేసి చిత్రాన్ని సంక్రాంతి బ‌రిలో నిల‌పాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ భావిస్తున్నార‌ట‌. అంతే కాకుండా అంతా భావిస్తున్న‌ట్టుగా ఇది `ఉగ్రం` రీమేక్ కాద‌ని ప్ర‌భాస్‌ని అభిమానులు ఏ స్థాయిలో చూడాల‌నుకుంటున్నారో అదే స్థాయి క‌థ‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టు ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చిన‌ట్టు తెలిసింది. దీంతో ప్ర‌భాస్ ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All