Homeగాసిప్స్ప్ర‌భాస్ `స‌లార్‌` స్టోరీ లైన్ ఇదేనా?

ప్ర‌భాస్ `స‌లార్‌` స్టోరీ లైన్ ఇదేనా?

ప్ర‌భాస్ `స‌లార్‌` స్టోరీ లైన్ ఇదేనా?
ప్ర‌భాస్ `స‌లార్‌` స్టోరీ లైన్ ఇదేనా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ వ‌రుస షాకులిస్తున్నారు. ఓ ప‌క్క `రాధేశ్యామ్‌` మూవీ చేస్తూనే వ‌రుస పాన్ ఇండియా  చిత్రాల్ని ప్ర‌క‌టిస్తూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. స్టార్ హీరోలు సైతం ప్ర‌భాస్ లైన‌ప్ చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నార‌‌ట‌. తాజాగా `కేజీఎఫ్‌` డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్‌నీల్ తో భారీ పాన్ ఇండియా మూవీని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. `స‌లార్‌` పేరుతో రూపొందుతున్న ఈ మూవీలో ప్ర‌భాస్ కొత్త త‌ర‌హా పాత్ర‌లో క‌నిపిస్తున్నారు.

`కేజీఎఫ్‌`తో సంచ‌ల‌నం సృష్టించిన హోంబ‌లే మేక‌ర్స్ విజ‌య్ కిరగందుర్ ఈ చిత్రాన్ని అత్య‌తం ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించ‌బోతున్నారు. టైటిల్ పోస్ట‌ర్ నుంచే ఈ మూవీపై దేశ వ్యాప్తంగా చ‌ర్చ మొద‌లైంది. `స‌లార్‌` అంటే ఏంట‌ని ఈ ప‌దానికి అర్థం ఏంట‌ని సెర్చ్ చేయ‌డం మొద‌లుపెట్టారు. ఈ నేప‌థ్యంలో టైటిల్ అర్థం ఏంట‌నేది.. ప్ర‌భాస్‌నే ఈ మూవీకి ఎందుకు ఎంచుకున్న‌ది ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ వెల్ల‌డించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన ఓ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

- Advertisement -

ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన క‌న్నడ చిత్రం `ఉగ్రం`. ఈ మూవీ క‌న్న‌డ‌లో సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. ఇదే మూవీని గ‌త కొన్నేళ్ల క్రితం ప్ర‌భాస్‌తో రీమేక్ చేస్తారంటూ వార్త‌లు వినిపించాయి. కానీ కార్య‌రూపం దాల్చ‌లేదు. ఇదే మూవీ మెయిన్ ప్లాట్‌ని తీసుకుని దాని ప‌రిధిని పెంచుతూ ప్ర‌శాంత్ నీల్ కొత్త క‌థ‌ని సిద్ధం చేశాడ‌ట‌. ఇందులో ప్ర‌భాస్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపిస్తార‌ట‌. చ‌నిపోతున్న త‌న మిత్రుడికిచ్చిన మాట కోసం ప్ర‌భాస్ ఏం చేశాడ‌న్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన ఇతివృత్త‌మ‌ని హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో ఈ మూవీ వుండ‌బోతోంద‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All