Homeగాసిప్స్`స‌లార్‌` తెర వెన‌‌క క‌థేంటి?.. ప్ర‌భాస్ పాత్ర ఇదేనా?

`స‌లార్‌` తెర వెన‌‌క క‌థేంటి?.. ప్ర‌భాస్ పాత్ర ఇదేనా?

`స‌లార్‌` తెర వెన‌‌క క‌థేంటి?.. ప్ర‌భాస్ పాత్ర ఇదేనా?
`స‌లార్‌` తెర వెన‌‌క క‌థేంటి?.. ప్ర‌భాస్ పాత్ర ఇదేనా?

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ ఊహకంద‌ని ప్రాజెక్ట్‌ల‌తో వ‌రుస షాకులిస్తున్నారు. బుధ‌వారం `కేజీఎఫ్‌` ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ని ప్ర‌భాస్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. `స‌లార్‌` పేరుతో రూపొంద‌నున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. `కేజీఎఫ్‌`లో రాఖీభాయ్‌గా య‌ష్‌ని చూపించిన ప్ర‌శాంత్ నీల్ `స‌లార్‌`లో ప్ర‌భాస్‌ని ఎలా చూపంచ‌బోతున్నాడు? అత‌ని పాత్ర చిత్ర‌ణ ఎలా వుండ‌బోతోంది అన్న‌దానిపై చ‌ర్చ‌న‌డుస్తోంది.

హైఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ మూవీలో ప్ర‌భాస్ సామాన్యుల‌కు అండ‌గా వుండే డాన్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ని బ‌ట్టి చూస్తే ఊహాగానాల‌కు త‌గ్గ‌ట్టే ఈ మూవీలో హీరో ప్ర‌భాస్ అండ‌ర్ వ‌ర‌ల్డ్ డాన్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.  ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌లో ప్ర‌భాస్ లుక్ కూడా చాలా ఫెరోషియ‌స్‌గా కొత్త‌గా వుంది.

- Advertisement -

ఇక `స‌లార్‌` అంటే బ‌ల‌మైన నాయ‌కుడ‌ని తెలుస్తోంది. ఇదొక ఉర్దూ ప‌దంగా చెబుతున్నారు. టైటిల్ నుంచే ఆస‌క్తిని రేకెత్తిస్తున్న ఈ మూవీని రాకెట్ స్పీడుతో పూర్తి చేసి అంతే స్పీడుగా రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. జ‌న‌వ‌రి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభించి వీలైనంత త్వ‌ర‌గా రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All