Homeటాప్ స్టోరీస్సలార్ షూటింగ్ నూ మొదలుపెట్టేసిన ప్రభాస్

సలార్ షూటింగ్ నూ మొదలుపెట్టేసిన ప్రభాస్

సలార్ షూటింగ్ నూ మొదలుపెట్టేసిన ప్రభాస్
సలార్ షూటింగ్ నూ మొదలుపెట్టేసిన ప్రభాస్

రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు ప్యాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఒకదాని తర్వాత ఒక సినిమా షూటింగ్ చేస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు. రీసెంట్ గా రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసిన ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె మొదటి షెడ్యూల్ ను కూడా పూర్తి చేసాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తోన్న యాక్షన్ డ్రామా సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

ఈరోజు నుండి సలార్ రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలవుతోంది. నాలుగు నెలల తర్వాత సలార్ షూటింగ్ కు హాజరయ్యాడు ప్రభాస్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. శృతి హాసన్ కూడా ఈ తాజా షెడ్యూల్ లో పాల్గొంటోంది.

- Advertisement -

ప్రశాంత్ నీల్ తో కేజిఎఫ్ కు పనిచేసిన సాంకేతిక బృందమే ఈ చిత్రానికి కూడా పనిచేస్తుండడం విశేషం. కేజిఎఫ్ ను నిర్మించిన హోంబేలె ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ మధ్య తెరకెక్కిస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All