Homeగాసిప్స్ఈ ఏడాది ప్రభాస్ సినిమా లేనట్లే!

ఈ ఏడాది ప్రభాస్ సినిమా లేనట్లే!

ఈ ఏడాది ప్రభాస్ సినిమా లేనట్లే!
ఈ ఏడాది ప్రభాస్ సినిమా లేనట్లే!

రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 20వ సినిమా షూటింగ్ జార్జియాలో జరుగుతుండగా కరోనా వైరస్ ప్రభావం ఎక్కువవ్వడంతో టీమ్ దాన్ని అక్కడితో వదిలేసి ఇండియా తిరిగి వచ్చేసిన సంగతి తెల్సిందే. నిజానికి ఆ షెడ్యూల్ మరో 20 రోజుల పాటు సాగాల్సి ఉంది. ఒక ఛేజ్ సీక్వెన్స్ మరియు పలు సన్నివేశాలను చిత్రీకరించారు. కరోనా వైరస్ ప్రభావం తగ్గాక మళ్ళీ టీమ్ జార్జియా వెళ్లి షూట్ కొనసాగించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే ఇంటర్నేషనల్ ఫ్లయిట్స్ ఇప్పట్లో తిరిగేలా కనిపించట్లేదు. కరోనా వైరస్ ప్రభావం రానున్న కొన్ని రోజుల్లో తగ్గిపోయినా కానీ ప్రభాస్ టీమ్ జార్జియా వెళ్ళడానికి మరో కొన్ని నెలలు ఎదురుచూడక తప్పదు. మరో రెండు, మూడు నెలలు కచ్చితంగా ట్రావెల్ బ్యాన్ ఉండే అవకాశముంది. ఆ లెక్కన చూసుకుంటే జూన్ లేదా జులైకి కానీ ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం లేదు.

ఈ ఎఫెక్ట్ కచ్చితంగా రిలీజ్ డేట్ పై పడుతుంది. ఓ డియర్ అనే టైటిల్ అనుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం జులైకి పూర్తి చేసి అక్టోబర్ మొదటి వారంలో చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పుడు దాదాపు మూడు నెలలు షూటింగ్ అన్నదే జరిగే అవకాశం లేదు. పరిస్థితులు సద్దుమణిగాక ఎంత త్వరగా షూట్ ను ఫినిష్ చేద్దామనుకున్నా కానీ డిసెంబర్ కైనా కంప్లీట్ అవుతుందా అన్నది డౌటే. ఈ నేపథ్యంలో ఓ డియర్ వచ్చే ఏడాది మొదట్లో విడుదల కావొచ్చు. సో ఈ ఇయర్ ప్రభాస్ సినిమా విడుదలయ్యే అవకాశం లేదు.

- Advertisement -

బాహుబలి తర్వాత ఊహించిన దానికన్నా సాహో కోసం తీసుకున్నాడు ప్రభాస్. పోనీ తన 20వ సినిమా అయినా త్వరగా ఇచ్చేద్దామనుకుంటే ఇప్పుడు అనుకోని కారణాల వల్ల లేటవుతోంది. ప్రభాస్ ఇలా ప్రతీ సినిమాకూ రెండేళ్లకు పైగా సమయం తీసుకుంటుంటే అభిమానులు నిరాశ చెందడం ఖాయం. మరి దాన్ని ప్రభాస్ ఎలా అధిగమిస్తాడో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All