Homeటాప్ స్టోరీస్ప్రభాస్ ఉంటే చాలు సినిమాలు వద్దు - అనుష్క

ప్రభాస్ ఉంటే చాలు సినిమాలు వద్దు – అనుష్క

Anushka reveals her affection towards prabhas
Anushka reveals her affection towards prabhas

టాలీవుడ్ లో ఎప్పటినుంచో మోస్ట్ ఎలిజిబుల్ కపుల్ కేటగిరిలో ప్రభాస్ మరియు అనుష్క పేర్లు వినిపిస్తున్నాయి. ఇద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ మీద మరియు ఆఫ్ స్క్రీన్ మీద కూడా చాలా బావుంటుంది. ఇది ముఖ్యంగా వారిద్దరూ మంచి స్నేహితులు. సినిమాల పరంగా మరియు వ్యక్తిగత జీవితంలో కూడా అనేక విషయాలు తాము ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉంటామని ఇద్దరు వివిధ ఇంటర్వ్యూలలో తెలియజేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ అయితే  అనుష్క ను తమ వదినగా ఫిక్స్ అయిపోయారు. బాహుబలి సినిమా మొదలైనప్పటి నుండి ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు.? చేసుకుంటే అనుష్కని చేసుకుంటారా.? లేదా వేరే వారిని చేసుకుంటారా.? అన్న మిస్టరి కొనసాగుతూనే ఉంది. ఈ మధ్య మళ్ళీ ఇక అనుష్క డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారి అబ్బాయి ప్రకాష్ ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా వచ్చాయి.

అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైవిధ్యంగా అనుష్క సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 15 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక థీం తో నిర్వహించారు. ఆ వేడుకకు హాజరైన అనేక మంది ప్రముఖులు మరియు అనుష్కతో పనిచేసిన దర్శకులు  అనుష్క పెళ్లి చేసుకొని తనదైన కొత్త జీవితాన్ని మొదలు పెట్టాల్సి ఉందని సున్నితంగా ఆమెను రిక్వెస్ట్ చేశారు. అయితే బుల్లితెరపై సుమక్క నిర్వహిస్తున్న ఒక గేమ్ షోలో భాగంగా పాల్గొన్నఅనుష్కను సరదాగా ప్రభాస్ ఫోటో చూపించి ప్రభాస్ స్నేహం కావాలా.? లేదా సినిమాలు కావాలా.? అని అడిగితే అనుష్క ఏమాత్రం ఆలోచించకుండా “స్నేహం కన్నా సినిమాలు ముఖ్యం కాదు. అవసరమైతే సినిమాలైనా మానేస్తాను, కానీ ఫ్రెండ్స్ ని వదులుకోను.” అని చెప్పడంతో ఒక్కసారి అక్కడ ఉన్న అందరూ భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా అందరూ ఈ వీడియో క్లిప్ ని షేర్ చేస్తూ ప్రభాస్ ను కూడా ట్యాగ్ చేసి… “అన్నా పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావ్.? అని అల్లరి చేస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All