
తెలుగు సినిమాల షూటింగ్ లు ఈ మధ్య కాలంలో ఎక్కువగా జార్జియాలో జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా.. నరసింహారెడ్డి సినిమా ఎక్కువశాతం అక్కడే షూట్ చేసారు. సాంగ్స్, ఫైట్స్ తోపాటు ఎన్నో డిఫరెంట్ లోకేషన్స్ అక్కడ ఉండటంతో ప్రస్తుతం మన పెద్ద సినిమాలు అక్కడ షూట్ చేస్తున్నారు. ఇక గవర్నమెంట్పర్మిషన్ లు, పబ్లిక్ ఫ్రెండ్లీ ఉండటం, వీసా ఫార్మాలిటీలు కూడా కొంచెం సులువుగా ఉండటం మరొక కారణం.
డివైడ్ టాక్ తో సైతం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లు కొల్లగొట్టిన ఇండియన్ బాహుబలి ప్రభాస్ ఇప్పుడు తన లేటెస్ట్ సినిమా షూటింగ్ ను జార్జియాలో ఒక భారీ షెడ్యూల్ కంప్లీట్ చేసాడు. కేవలం 1 డిగ్రీ ఉష్ణోగ్రత, చలి, మంచు, ఎప్పుడు పడుతుందో తెలియని వాన, మరొక వైపు కరోనా భయం ఇవన్నీ ఉన్నా పంటిబిగువున భరిస్తూ షూట్ కంప్లీట్ చేసింది యూనిట్. ఇక ఈ విషయాన్ని, తమ సంతోషాన్ని షేర్ చేస్తూ, త్వరలో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ తెలిపింది. ఇక దాదాపు ఉగాది పండుగ సందర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఈ నెల 25న ఉండవచ్చు అని తెలుస్తోంది, ఇక ఇప్పటికే ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టేసారు. సాహో లుక్ కి ఏమాత్రం తగ్గకూడదు..! అని అంటున్నారు. ఇక ప్రభాస్ జార్జియా లొకేషన్ లో దిగిన ఫోటో మాత్రం వైరల్ అవుతోంది.