Thursday, October 6, 2022
Homeటాప్ స్టోరీస్“జాగ్రత్త డార్లింగ్స్” - ఫ్యాన్స్ కి ప్రభాస్ ఎమోషనల్ మెసేజ్

“జాగ్రత్త డార్లింగ్స్” – ఫ్యాన్స్ కి ప్రభాస్ ఎమోషనల్ మెసేజ్

Prabhas message to his fans on awareness of Coronavirus
Prabhas message to his fans on awareness of Coronavirus

టాలీవుడ్ లో ఉన్న హీరోలలో ఫ్యాన్స్ ని సొంత కుటుంబ సభ్యుల లాగా భావించి ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే హీరోలలో బాహుబలి ప్రభాస్ కూడా ఒకరు. తనతో పాటు సినిమాలకు పనిచేసే ఆర్టిస్ట్ లనూ, టెక్నీషియన్స్ నూ ఎంత బాగా చూసుకుంటాడో.? ఎంత ప్రేమిస్తాడో … అభిమానులను కూడా అంతకంటే బాగా చూసుకుంటాడు ప్రభాస్.  తనను కలవడానికి వచ్చిన వాళ్ళను అందరినీ ఓపికగా రిసీవ్ చేసుకునే ప్రభాస్.. మర్యాదలలో కూడా కృష్ణంరాజు గారిని గుర్తుకు తెస్తారు.

- Advertisement -

ఇక రీసెంట్ గా కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇబ్బందిపెడుతున్న నేపధ్యంలో ప్రభాస్ తన అభిమానులను జాగ్రత్తగా ఉండమంటూ ఒక ఎమోషనల్ మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఒకవైపు కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు ఉన్నా… ఎన్నో వ్యయ ప్రయాసల నడుమ తన కొత్త సినిమా జార్జియా కీలక షెడ్యూల్ కంప్లీట్ చేసాడు ప్రభాస్. అదే సమయంలో తన అభిమానులకు సందేశం పంపించాడు.

“ఇది చాలా కష్టమైన సమయం. మన ఆరోగ్యం మరియు మన సమాజ భద్రత కు సవాల్ వంటి విషయం. కానీ మనపై దాడి చేస్తున్న ఈ కోవిడ్ 19 కరోనా వైరస్ ను మనం ఎదుర్కోగలం. దీనికి అందరూ మీ వంతు బాధ్యత తీసుకోండి. జాగ్రత్తలు వహించండి. పుకార్లు వ్యాపించకుండా చూడండి.” అని భావోద్వేగమైన పోస్ట్ పెట్టారు ప్రభాస్.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts