Homeటాప్ స్టోరీస్రామ్ చరణ్, రానా లకు బాహుబలి గ్రీన్ ఛాలెంజ్ !

రామ్ చరణ్, రానా లకు బాహుబలి గ్రీన్ ఛాలెంజ్ !

రామ్ చరణ్, రానా లకు  బాహుబలి గ్రీన్ ఛాలెంజ్ !
రామ్ చరణ్, రానా లకు బాహుబలి గ్రీన్ ఛాలెంజ్ !

జార్జియా వెళ్లొచ్చిన తరువాత సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లిపోయారు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘జాన్’ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం జార్జియా వెళ్లిన ప్రభాస్ ఆ తరువాత పబ్లిక్ కి కనిపించకుండా కేవలం ఇంటికే పరిమితం అయిపోయారు.

స్టార్ హీరోలు బి ద రియల్ మెన్ ఛాలెంజ్  లోనూ కనిపించలేదు. హీరోలు, డైరెక్టర్లు ప్రభాస్ ని నామినేట్ చెయ్యలేదు కూడా. దాదాపు రెండు నెలలపాటు మీడియాకూ ఫాన్స్ కి దూరంగా వున్నా ప్రభాస్ తాజాగా తెరాస ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ని స్వీకరించారు. మొక్కలు నాటిన ప్రభాస్ నాటిన మొక్కల పక్కన ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.
ఈ సందర్భంగా గ్రీన్ ఛాలెంజ్ ని హీరోలు రామ్ చరణ్, రానాలకు విసిరారు. ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. పూజ హెగ్డే హీరోయినిగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తల్లిగా ‘ప్రేమ పావురాలు’ ఫెమ్ భాగ్యశ్రీ కనిపించనుంది.
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All