Homeటాప్ స్టోరీస్సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.30 లక్షలు – రామ్ చరణ్ తేజ్

సినీ కార్మికుల సంక్షేమం కోసం రూ.30 లక్షలు – రామ్ చరణ్ తేజ్

 

Ram Charan Tej Declared Rs.30 Lakhs for daily wage workers welfare
Ram Charan Tej Declared Rs.30 Lakhs for daily wage workers welfare

కరోనా వైరస్ మహమ్మారి భారతదేశాన్ని గమనించకుండా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు వస్తున్న నేపథ్యంలో అన్ని  రంగాలకు చెందిన చిన్న ఉద్యోగులు మరియు రోజువారీ కార్మికుల  ఉపాధికి భంగం వాటిల్లింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో పెద్ద ఎత్తున పని చేసే అన్ని రకాల డిపార్ట్మెంట్ లకు సంబంధించిన రోజువారీ కార్మికులకు అండగా నిలబడటానికి ప్రస్తుతం సినిమా తారలు అందరూ కదిలి వస్తున్నారు.

- Advertisement -

కరోనా క్రైసిస్ చారిటీ అనే ఒక ప్రత్యేక విభాగం ద్వారా వారిని ఆదుకునే చర్య మొదలైంది. ఇక ప్రస్తుతం ఆ విభాగానికి సంబంధించి గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కరోనా వైరస్ పై పోరాటానికి తమ వంతు బాధ్యతగా విరాళాలు అందించిన సినిమా తారలు కూడా స్వయంగా మళ్లీ తమ సినీ కళామతల్లి ని నమ్ముకున్న సినీ జీవుల కోసం మళ్లీ పెద్ద ఎత్తున విరాళాలు ప్రకటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమా కార్మికుల సంక్షేమం కోసం మరియు రోజువారీ కార్మికులకు అండగా నిలబడటానికి ఈ విభాగానికి 30 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉండే రామ్ చరణ్ తేజ్ సినిమా పరిశ్రమకు సంబంధించిన కార్మికుల సంక్షేమం కోసం చేసిన ఈ ప్రయత్నం ఎంతో గొప్పది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All