Tuesday, September 27, 2022
Homeటాప్ స్టోరీస్ప్రభాస్ అభిమానుల రచ్చ మరోసారి మొదలయ్యేలా ఉందిగా

ప్రభాస్ అభిమానుల రచ్చ మరోసారి మొదలయ్యేలా ఉందిగా

Prabhas fans wants update on Jaan
Prabhas fans wants update on Jaan

ప్రతి సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఉండడం కామనే. స్టార్ హీరో అన్నాక లక్షల్లో అభిమానులు ఉంటారు. ప్రతి హీరోకి అభిమానులు కీలకం. వాళ్ళు లేకుండా హీరోలు మనుగడ కూడా సాగించలేరు. అంత కీలకమైన అభిమానులని సరిగ్గా పట్టించుకునే స్టార్ హీరోలు ఎంత మంది? అసలు అభిమానులు ఏ సినిమాకైనా ఎంత ముఖ్యమో తెల్సిందే. తమ అభిమాన హీరో సినిమా వస్తోందంటే వాళ్ళు చేసే హంగామా మాములుగా ఉండదు. సోషల్ మీడియాలో తమ హీరో పరువు పోకుండా కాపాడుతుంటారు. ఏదైనా వీడియో విడుదలైతే దానికి ఏదొక రికార్డు వచ్చేదాకా వదిలిపెట్టరు. అలాగే సినిమా విడుదలకు థియేటర్లను ముస్తాబు చేస్తుంటారు. తమ సొంత డబ్బు ఖర్చు పెట్టి మరీ హీరోలకు కటౌట్లు కడతారు. సినిమా థియేటర్లలో ఉండి వెళ్లే దాకా దాని బాగోగులు మొత్తం చూసుకుంటారు. యాంటీ ఫ్యాన్స్ తమ హీరోకి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడినా చాలు వాళ్లతో యుద్ధానికి దిగడానికి కూడా సిద్ధపడుతుంటారు. అంతలా తమ హీరో కోసం ప్రతి క్షణం పాకులాడే అభిమానులు తిరిగి తమ హీరో నుండి ఆశించేది ఏముంటుంది. ఎప్పటికప్పుడు సినిమా ఎలా వస్తోందో తెలుసుకోవాలనే కుతూహలం తప్ప. అయితే ఆ విషయంలో కూడా మన హీరోలు ఒక్కోసారి అభిమానులను నెగ్లెక్ట్ చేస్తుంటారు.

- Advertisement -

ప్రతిసారి సినిమా గురించి అప్డేట్ ఇవ్వమంటే అది కచ్చితంగా కుదరని వ్యవహారమే కానీ అసలు తమ హీరో సినిమా పరిస్థితి ఏంటనేది రెండు నెలలకు ఒక్కసారైనా తెలుసుకోవాలని అనుకోవడంలో తప్పేముంది? లేటెస్ట్ ప్రభాస్ అభిమానుల ఆగ్రహానికి కారణం కూడా ఇదే. రెబెల్ స్టార్ ప్రభాస్ ఏదైనా వేదిక మీద తన అభిమానులని డార్లింగ్స్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తాడు కానీ సోషల్ మాధ్యమాల్లో మాత్రం ఒక్కసారి కూడా తన సినిమా గురించిన అప్డేట్ పెట్టడు. పోనీ హీరో పెట్టకపోతే కనీసం ఆ బాధ్యత ప్రొడక్షన్ హౌస్ అయినా తీసుకోవాలి. బాహుబలి తర్వాత నుండి ప్రభాస్ తన స్నేహితులైన యూవీ క్రియేషన్స్ కే సినిమాలకు కట్టుబడి ఉన్నాడు. ఇప్పటికే సాహో వచ్చింది. జాన్ సినిమా వచ్చే ఏడాది రాబోతోంది.

అయితే సాహో విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత ఇబ్బంది పడ్డారో అందరం చూసాం. సినిమా ఏడాదికి పైగా షూటింగ్ లోనే ఉంటే
ఏదైనా ఒక్క అప్డేట్ ఇవ్వమని ఎంతలా ప్రొడక్షన్ హౌస్ ను వేడుకున్నా వాళ్ళు కనికరించింది లేదు. చివరికి యూవీ క్రియేషన్స్ ఆఫీస్ దగ్గరకి వెళ్లి ప్రభాస్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేసే స్థాయికి వెళ్ళింది. అప్పుడు కానీ సాహో టీమ్ కదిలివచ్చి అప్డేట్ ఇచ్చింది లేదు. ఇప్పుడు ప్రభాస్ జాన్ సినిమా పరిస్థితి గురించి కూడా ఇటువంటి ఆందోళనే మొదలయ్యేలా కనిపిస్తోంది. అసలు ఈ సినిమా ఎన్ని షెడ్యూల్స్ అయ్యాయి, ఎంత షూటింగ్ జరిగింది లాంటి విషయాలేవీ అభిమానులకు తెలీవు. wewantprabhas20update అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి మరీ ప్రభాస్ ఫ్యాన్స్ యుద్ధానికి దిగుతున్నారు. మరి ఇప్పుడైనా యూవీ క్రియేషన్స్ వాళ్ళు కనికరిస్తారేమో చూడాలి.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts