
బాహుబలి చిత్రంతో ప్రభాస్ రేంజ్ ఓ రేంజ్ లో మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తర్వాత వచ్చిన సాహో ఇక్కడ నిరాశపరిచినా నార్త్ ప్రేక్షకులకు మాత్రం ప్రభాస్ ను దగ్గర చేసింది. రాధే శ్యామ్ చిత్రాన్ని పూర్తి చేసాడు ప్రభాస్. జనవరి 14న ఈ చిత్రం విడుదలవుతుంది. మరోవైపు ఆది పురుష్, సలార్ చిత్రాల షూటింగ్స్ తో ప్రభాస్ బిజీ.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె కూడా మొదలుపెట్టాడు. ఒక చిన్న షెడ్యూల్ అనంతరం ఈ సినిమా షూటింగ్ ను పక్కనపెట్టారు. ఆది పురుష్, సలార్ పూర్తయ్యాక ప్రాజెక్ట్ కె ను ఏకధాటిలో ఫినిష్ చేస్తాడు. ఇక నిన్న ప్రభాస్ నుండి సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ ను అనౌన్స్ చేసాడు ప్రభాస్. ఇది ప్యాన్ వరల్డ్ సినిమా. ప్రభాస్ కెరీర్ లో 25వ చిత్రం.
అయితే ప్రభాస్ నుండి 24వ సినిమాకు సంబంధించిన ప్రకటన ఇంకా రాలేదు. తన 24వ సినిమాతో పాటు, 26వ సినిమాను కూడా ప్రభాస్ కన్ఫర్మ్ చేసేసాడట. బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ తో సినిమా చేయనున్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో దిల్ రాజు నిర్మాణంలో మరో సినిమా చేస్తాడట. 2021 చివర్లో ఈ రెండు చిత్రాలను కూడా ప్రభాస్ ప్రకటిస్తాడు. వచ్చే నాలుగైదేళ్ల వరకూ ప్రభాస్ ఫుల్ బిజీ అనమాట.