Homeటాప్ స్టోరీస్సైరా పవర్ ఫుల్ డైలాగ్ లీక్

సైరా పవర్ ఫుల్ డైలాగ్ లీక్

powerful dialogue from sye raa narasimhareddy leakedసైరా ……. నరసింహారెడ్డి చిత్రంలోని పవర్ ఫుల్ డైలాగ్ లీక్ అయ్యింది అయితే అది ఎవరో లీక్ చేసింది తెలుసా ……. ఆ చిత్ర కథా రచయిత పరుచూరి గోపాలకృష్ణ . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చేయమని చిరంజీవి చుట్టూ పన్నెండు సంవత్సరాలుగా వెంట బడుతున్నారట అయితే చిరంజీవి మాత్రం ఆ సాహసం చేయలేదు కట్ చేస్తే ఇప్పుడు సాహసానికి ముందుకు వచ్చాడు చిరు దాంతో సినిమా మొదలయ్యింది వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . ఇటీవలే చిరంజీవి పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని విడుదల చేసిన టీజర్ తో అంచనాలు స్కై లెవల్లో ఏర్పడ్డాయి .

అయితే ఇందులోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ ని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ని ఉరి తీసేముందు రెండు చేతులను వెనక్కి కట్టిన సమయంలో వచ్చే డైలాగ్ ని చెప్పి అభిమానులకు సంతోషాన్ని అందించాడు పరుచూరి . ఇంతకీ ఆ డైలాగ్ ఏంటో తెలుసా …….. ” ఏంట్రా …… ఆ ధైర్యం సావు భయం లేదా నీకు ” అని అంటే …… సచ్చి పుట్టినవాడిని ,సనిపోయిన తర్వాత కూడా బతికేవాడ్ని ,సావంటే నాకెందుకురా భయం ” అని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అలియాస్ చిరంజీవి చెప్పే డైలాగ్ వినిపించాడు . ఈ పవర్ ఫుల్ డైలాగ్ తో మెగా అభిమానులు సంతోషంతో ఉప్పొంగి పోతున్నారు .

- Advertisement -

English Title: powerful dialogue from sye raa narasimhareddy leaked

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All