Homeటాప్ స్టోరీస్సైరా .... నరసింహారెడ్డి టీజర్ : ఫ్యాన్స్ ఖుషీ

సైరా …. నరసింహారెడ్డి టీజర్ : ఫ్యాన్స్ ఖుషీ

sye raa narasimhareddy teaser outరేపు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కొద్దిసేపటి క్రితం సైరా ……. నరసింహారెడ్డి టీజర్ ని విడుదల చేసారు . ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా తాజాగా విడుదలైన టీజర్ తో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అంతేలేకుండా పోయింది . భారీ విజువల్స్ , మెగాస్టార్ చిరంజీవి డైలాగ్ , రీ రికార్డింగ్ వెరసి సైరా నరసింహారెడ్డి హార్ట్ బీట్ ని పెంచేసింది . ఈ టీజర్ తో సినిమా ఏ లెవల్లో ఉండబోతోందో అర్ధం అయ్యింది దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు .

రీ ఎంట్రీ లో చిరంజీవి ఖైదీ నెంబర్ 150 చిత్రం తర్వాత చేస్తున్న చిత్రమిది , దీనికంటే ముందు రకరకాల స్క్రిప్ట్ లను విని ఫైనల్ గా ఇది ఓకే చేసాడు చిరు ఇక ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది చిరు తనయుడు రాంచరణ్ కావడం విశేషం . సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ , జగపతిబాబు , నయనతార తదితరులు నటిస్తున్నారు . 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది 2019 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అభిమాన హీరో పుట్టినరోజు సందర్బంగా టీజర్ రిలీజ్ కావడంతో అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు .

- Advertisement -

English Title: sye raa narasimhareddy teaser out

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All