Homeటాప్ స్టోరీస్అయ్యో ! ఇంత దారుణమా చినబాబు

అయ్యో ! ఇంత దారుణమా చినబాబు

poor collections for karthis chinna babuతమిళ స్టార్ హీరో కార్తీ నటించిన చినబాబు చిత్రాన్ని ఈనెల 13న ఎటువంటి పబ్లిసిటీ లేకుండా విడుదల చేసారు కట్ చేస్తే ఘోరమైన ఓపెనింగ్స్ ని రాబట్టింది . రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కనీసం కోటి రూపాయల షేర్ కూడా రాబట్టలేకపోయింది . ఇక రెండో రోజు కూడా అంతంత మాత్రమే మొత్తంగా మూడు రోజులకు కలిపి 2. 74 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది అంటే ఎంత దారుణంగా కలెక్షన్లు ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు . అసలు అంతా కొత్తవాళ్లతో చేసిన ” ఆర్ ఎక్స్ 100 ” చిత్రం ఏకంగా నాలుగు రోజుల్లోనే 5 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసి సంచలనం సృష్టిస్తుండగా స్టార్ హీరో నటించిన చినబాబు మాత్రం ముక్కి మూలుగుతూ రెండున్నర కోట్ల ని దాటింది అంతే !

కార్తీ తమిళ స్టార్ హీరో మాత్రమే కాదు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో . పైగా చినబాబు చక్కని ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా దాంతో మంచి వసూళ్లు రావాల్సి ఉండే కానీ ఘోరమైన వసూళ్లు వస్తున్నాయి అంటే ప్రేక్షకులు చినబాబు ని పట్టించుకోవడం లేదు , ఆర్ ఎక్స్ 100 చూడటానికి కురాళ్ళ ఎగబడుతున్నారు దాంతో ఫ్యామిలీ చిత్రాలను కోరుకునే వాళ్లకు మంచి ఆప్షన్ ఈ చినబాబు కానీ ఆ దిశగా పబ్లిసిటీ మాత్రం చేయడం లేదు . కార్తీ సినిమాకు పబ్లిసిటీ లేకపోవడం పెద్ద మైనస్ అయ్యిందనే చెప్పాలి .

- Advertisement -

English Title: poor collections for karthis chinna babu

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All