Homeటాప్ స్టోరీస్ఆర్ ఎక్స్ 100 నాలుగు రోజుల వసూళ్లు

ఆర్ ఎక్స్ 100 నాలుగు రోజుల వసూళ్లు

RX 100 four days collectionsచిన్న చిత్రంగా విడుదలైన ఆర్ ఎక్స్ 100 చిత్రం తెలుగునాట ప్రభంజనం సృష్టిస్తోంది . కేవలం నాలుగు రోజుల్లోనే 5 కోట్లకు పైగా షేర్ సాధించి సంచలనం సృష్టిస్తోంది . ఆర్ ఎక్స్ 100 వసూళ్ల ని చూసి ట్రేడ్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురౌతున్నారు . ఏమాత్రం అంచనాలు లేని చిత్రం వసూళ్ల సునామి సృష్టించడం తో ఆ చిత్ర బృందం చాలా చాలా సంతోషంగా ఉన్నారు . కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే 5 కోట్లకు పైగా షేర్ సాధించడంతో లాభాల పంట పండుతోంది ఆ చిత్ర బృందానికి అలాగే ఆ సినిమాని కొనుక్కున్న వాళ్లకు .

కార్తికేయపాయల్ రాజ్ పుత్ ల రొమాన్స్ కుర్రాళ్ళని కట్టి పడేస్తోంది , ఘాటు కౌగిలింతలు , లిప్ లాక్ లు బోల్డ్ సన్నివేశాలు కుర్రాళ్ళ ని టార్గెట్ చేసాయి . దర్శకుడు అజయ్ భూపతి ని ప్రశంసలతో ముంచెత్తు తున్నారు పలువురు ప్రముఖులు . ఇక పాయల్ రాజ్ పుత్ అయితే ఈ ఒక్క సినిమాతోనే స్టార్ అయిపొయింది , ఈ సినిమాలో రెచ్చిపోయిన తీరుకి కుర్రాళ్ళు తమ శృంగార దేవతగా ఆరాధిస్తున్నారు ఈ భామని .
ఆర్ ఎక్స్ 100 నాలుగు రోజుల షేర్
నైజాం – 2,42,10,653
సీడెడ్ – 58,75,410
ఉత్తరాంధ్ర – 61,19,595
కృష్ణా – 34, 86,838
గుంటూరు – 36,46,663
ఈస్ట్ – 42,53,309
వెస్ట్ – 31,54,193
నెల్లూరు – 10,58,161
మొత్తం – 5,18,04,822

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All