Homeటాప్ స్టోరీస్చినబాబు రివ్యూ

చినబాబు రివ్యూ

Chinna Babu Movie Review
చినబాబు రివ్యూ

చినబాబు రివ్యూ :
నటీనటులు : కార్తీ ,సాయేషా సైగల్
సంగీతం : డి . ఇమాన్
నిర్మాత : సూర్య , రవీందర్ రెడ్డి
దర్శకత్వం : పాండిరాజ్
రేటింగ్ : 3/ 5
రిలీజ్ డేట్ : 13 జులై 2018

తమిళ హీరో కార్తీ రైతు గా నటించిన చిత్రం చినబాబు . సాయేషా సైగల్ , సత్యరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పాండిరాజ్ దర్శకత్వం వహించాడు . రైతుల సమస్యల తో తెరకెక్కిన ఈ చిత్రం విజయం సాధించేలా రూపొందిందా ? లేదా ? అన్నది తెలియాలంటే కథ లోకి వెళ్లాల్సిందే .

కథ :

- Advertisement -

అయిదుగురు అక్కలకు ముద్దుల తమ్ముడు చినబాబు ( కార్తీ ) ఆర్గానిక్ వ్యవసాయం చేస్తూ ఉత్తమ రైతుగా అవార్డులు అందుకుంటాడు అయితే అదే ఊళ్ళో ని వ్యక్తి సుందర్ రాజు ( శత్రు ) కి చినబాబు తో వైరం ఉంటుంది దానికి తోడు తన మేన కోడళ్ళు ఇద్దరు చినబాబు ని ప్రేమిస్తారు కానీ చినబాబు మాత్రం నీల నీరద (సాయేషా ) ని ప్రేమిస్తాడు దాంతో చినబాబు కుటుంబంలో చిచ్చు రాజుకుంటుంది . మనస్పర్థలు ఎక్కువై సమస్యలు వస్తాయి ? ఆ సమస్యలను పరిష్కరించడానికి చినబాబు ఏం చేసాడు ? మళ్ళీ తన కుటుంబంతో కలిశాడా ? ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా ? తదితర విషయాలన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే .

హైలెట్స్ :

కార్తీ నటన
కథ

డ్రా బ్యాక్స్ :

తమిళ నేటివిటీ
సాగతీత సన్నివేశాలు

నటీనటుల ప్రతిభ :

రైతు పాత్రలో నటించిన కార్తీ ఆ పాత్రలో సరిగ్గా సరిపోయాడు , రైతు ని అని చెప్పుకోవడానికి గర్వపడాలి కానీ సిగ్గుపడోద్దు అని చెప్పడమే కాకుండా ఆ హుందాతనాన్ని తీసుకొచ్చాడు కూడా . సెంటిమెంట్ సీన్స్ లలో కార్తీ నటన బాగుంది . సినిమాకు ఆయువు పట్టుగా కార్తీ నిలిచాడు . ఇక సయేశా సైగల్ గ్లామర్ తో పాటుగా పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఆకట్టుకుంది . సత్యరాజ్ తన పాత్ర కు న్యాయం చేసాడు . ఇక మిగిలిన పాత్రధారులు తమతమ పాత్రలకు న్యాయం చేసారు .

సాంకేతిక వర్గం :

వేల్ రాజ్ ఛాయాగ్రహణం చాలా బాగుంది , పల్లెటూరి అందాలను చక్కగా తన కెమెరా లో బంధించి దృశ్య కావ్యం లా మలిచాడు . డి .ఇమాన్ సంగీతం కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచింది . సూర్య నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఇక దర్శకుడు పాండిరాజ్ విషయానికి వస్తే …… …. రైతు సమస్యలపై మంచి కథనాన్ని ఎంచుకున్నాడు అయితే కొన్ని సాగతీత సన్నివేశాలు తీసేస్తే మరింత బాగుండేది .ఉమ్మడి కుటుంబం లోని భావోద్వేగ సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు .

ఓవరాల్ గా :

బిసి కేంద్రాల బాబు ఈ చినబాబు

English Title: Chinna Babu Movie Review

                         Click here for English Review

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All