Homeగాసిప్స్మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన పూజ హెగ్డే

మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన పూజ హెగ్డే

మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన పూజ హెగ్డే
మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన పూజ హెగ్డే

సినీ కెరీర్ అంటేనే అంత. ఎప్పుడు ఎవర్ని ఎలా టర్న్ చేస్తుందో ఎవరికీ తెలీదు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాల్లో నటించేటప్పుడు ఎవరూ పూజ హెగ్డే ఇంత పెద్ద స్టార్ అవుతుందని అనుకోలేదు. పైగా అమ్మడు నటించిన మొదటి సినిమాలు అన్ని భాషల్లో ప్లాపులే. అయినా కానీ పూజకు అవకాశాలు మాత్రం తగ్గలేదు. డీజే సినిమాలో చేసిన గ్లామర్ షో కు మంచి మార్కులే పడ్డాయి. నెమ్మదిగా తెలుగులో విజయాలు రావడం మొదలయ్యాయి. అరవింద సమేత చిత్రంతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న హెగ్డే, మహర్షితో మరో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక అల వైకుంఠపురములో సక్సెస్ గురించి చెప్పేదేముంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అంటే కచ్చితంగా పూజ హెగ్డేనే. వరస విజయాలతో దూసుకుపోతున్న ఈమెకు బాలీవుడ్ నుండి కూడా అవకాశాలు బాగున్నాయి. అక్కడ హౌస్ ఫుల్ 4 తో సూపర్ డూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు ఏకంగా సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది.

తెలుగులో ప్రభాస్ సరసన ఓ డియర్/ రాధే శ్యామ్ లో హీరోయిన్ గా చేస్తోన్న విషయం తెల్సిందే. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజవుతోంది. అక్కినేని అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తోన్న పూజ హెగ్డేకు ఇప్పుడు మరో భారీ అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.

- Advertisement -

సూర్య – హరి కాంబినేషన్ అంటే కోలీవుడ్ లో భారీ అంచనాలు ఉంటాయి. వీరి కాంబినేషన్ లో వచ్చిన సింగం సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రం కోసం పూజ హెగ్డేను కథానాయికగా తీసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ పూజ కనుక తన బిజీ షెడ్యూల్ లో డేట్స్ అడ్జస్ట్ చేయగలిగితే ఇది కచ్చితంగా ఆమెకు మంచి అవకాశమవుతుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All