Homeటాప్ స్టోరీస్పూజ హెగ్డేతో ప్రభాస్ కు ఇబ్బందులు తప్పేలా లేదు

పూజ హెగ్డేతో ప్రభాస్ కు ఇబ్బందులు తప్పేలా లేదు

పూజ హెగ్డేతో ప్రభాస్ కు ఇబ్బందులు తప్పేలా లేదు
పూజ హెగ్డేతో ప్రభాస్ కు ఇబ్బందులు తప్పేలా లేదు

పూజ హెగ్డే ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ మోస్ట్ హీరోయిన్. టాప్ హీరోలు ఆమెతో సినిమా చేయాలని కోరుకుంటున్నారు. గ్లామర్ గా కనిపించడానికి అస్సలు సంకోచించకపోవడం, పొడుగు హీరోల పక్కన సరిగ్గా సెట్ అవ్వడం, ఈ మధ్య ఆమె సక్సెస్ ట్రాక్ రికార్డ్ కూడా బాగుండడంతో పూజ హెగ్డేకు ఇప్పుడు డిమాండ్ మాములుగా లేదు. ప్రస్తుతం తెలుగులో పూజ హెగ్డే మీడియం రేంజ్ సినిమాలకు 2 కోట్లు, పెద్ద సినిమాలకు రెండున్నర కోట్లు పారితోషికం తీసుకుంటోంది. దీనికి అదనంగా హోటల్ బిల్స్, ఫుడ్, వాటర్ బిల్స్ ఉండనే ఉన్నాయి.

ప్రస్తుతం తెలుగులో పూజా హెగ్డే, ప్రభాస్ తో సినిమా చేస్తోంది. అలాగే అఖిల్ సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సినిమాకు ఇంకా కొన్ని రోజుల కాల్ షీట్స్ ఉన్నాయి. వీటికి తోడు బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ సరసన సినిమాలో నటించే అవకాశాన్ని సైతం పట్టేసింది. ప్రభాస్ సినిమా కోసం పూజ హెగ్డే జార్జియా వెళ్లిన సంగతి తెల్సిందే. ఇటీవలే అక్కడ భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్నా సరే లెక్క చేయకుండా జార్జియా వెళ్లి షూటింగ్ చేసుకుని వచ్చారు. అయితే అక్కడ కేవలం పది రోజుల షూటింగ్ మాత్రమే సాధ్యమైంది. ఇంకా 20 రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నా సరే ప్రభాస్ అండ్ కో అంతర్జాతీయ రాకలపై ట్రావెల్ బ్యాన్ ఉండడంతో హైదరాబాద్ తిరిగి వచ్చేసారు.

- Advertisement -

ఇప్పుడు షూటింగ్ మళ్ళీ చేసుకోవచ్చు అన్న అనుమతి లభించాక తిరిగి ప్రభాస్ అండ్ టీమ్ జార్జియా వెళ్లాల్సి ఉంటుంది. కానీ అప్పుడు పూజ హెగ్డే డేట్స్ పట్టుకోవడం అంత తేలికగా అయ్యే పనికాదు. ఇప్పుడు చేస్తోన్న సినిమా వాళ్ళు అందరూ ఆమె డేట్స్ గురించి పట్టుబడతారు. సల్మాన్ ఖాన్ సినిమా కూడా ఉంది కాబట్టి దానికి నో చెప్పే అవకాశం లేదు. ఇక అఖిల్ సినిమాకు ఎక్కువ రోజులు షూటింగ్ బ్యాలెన్స్ లేదు కాబట్టి మ్యానేజ్ చేయొచ్చు. ఇక చిక్కల్లా ప్రభాస్ సినిమాతోనే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All