Homeటాప్ స్టోరీస్మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు డబ్బింగ్ చెబుతోన్న పూజ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు డబ్బింగ్ చెబుతోన్న పూజ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు డబ్బింగ్ చెబుతోన్న పూజ
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ కు డబ్బింగ్ చెబుతోన్న పూజ

పూజ హెగ్డే.. ప్రస్తుతం అటు ఇండస్ట్రీ సర్కిల్స్ లో అటు ప్రేక్షకుల్లో ఎక్కువగా నానుతోన్న పేరు. వరసగా సూపర్ డూపర్ హిట్స్ అందుకుంటూ టాప్ రేంజ్ సినిమాలను తన బుట్టలో వేసుకుంటోంది. పూజ హెగ్డే ఫీమేల్ లీడ్ గా నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ అక్టోబర్ 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి.

అఖిల్ అక్కినేని లీడ్ రోల్ లో నటిస్తోన్న ఈ సినిమాలో అఖిల్ ఎన్ఆర్ఐ పాత్రను పోషిస్తుండగా పూజ స్టాండప్ కమెడియన్ గా నటిస్తోంది. వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీ ప్రధానంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ నడుస్తుంది. ప్రస్తుతం పూజ హెగ్డే ఈ చిత్రాన్ని డబ్బింగ్ చెబుతోంది. తన పాత్రకు తనే డబ్బింగ్ చెబుతుండడం విశేషం.

- Advertisement -

ఈ చిత్రం కాకుండా రాధే శ్యామ్, ఆచార్య చిత్రాల్లో కూడా పూజ హెగ్డే నటించింది. గోపి సుందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని బన్నీ వాస్, వాసు వర్మ నిర్మించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All