Homeటాప్ స్టోరీస్కృష్ణాష్టమి పోస్టర్ ను విడుదల చేసిన రాధే శ్యామ్

కృష్ణాష్టమి పోస్టర్ ను విడుదల చేసిన రాధే శ్యామ్

కృష్ణాష్టమి పోస్టర్ ను విడుదల చేసిన రాధే శ్యామ్
కృష్ణాష్టమి పోస్టర్ ను విడుదల చేసిన రాధే శ్యామ్

రెబెల్ స్టార్ ప్రభాస్ చేస్తోన్న రొమాంటిక్ డ్రామా రాధే శ్యామ్. ఈ చిత్రం ప్యాన్ ఇండియా లెవెల్లో విడుదలవుతుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 14న విడుదల కాబోతోంది. ఈరోజు కృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాధే శ్యామ్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు.

ప్రభాస్, పూజ హెగ్డే కలిసి పియానో వాయిస్తున్న పిక్చర్ ను విడుదల చేసారు. దీంతో పాటు జనవరి 14న విడుదల చేస్తున్నట్లు మరోసారి ధృవీకరించారు. ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతికి వస్తోందని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రకటించిన సినిమా రిలీజ్ లు వాయిదా పడతాయని అంతా భావించారు. అయితే రాధే శ్యామ్ మాత్రం సంక్రాంతి రిలీజ్ కే స్టిక్ ఆన్ అయింది.

- Advertisement -

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఇదివరకే పూర్తయింది. దాదాపు మూడేళ్ళ పాటు రాధే శ్యామ్ షూటింగ్ సాగింది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న రాధే శ్యామ్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All