
ప్రస్తుతం పూజ హెగ్డే టైమ్ మాములుగా నడవట్లేదు. అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ అన్న తేడా లేకుండా పూజ హెగ్డే అన్ని ఇండస్ట్రీలలోనూ టాప్ ఆఫర్లను కొట్టేసింది. రీసెంట్ గా 15 మిలియన్ ఫాలోయర్లను సాధించిన పూజ, ఫ్యాన్స్ తో లైవ్ సెషన్ ను పెట్టింది. ఈ లైవ్ లో తన రాబోయే ప్రాజెక్ట్స్ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నానని చెప్పిన పూజ, వాటి గురించి మాత్రం ఆచి తూచి స్పందించింది.
ప్రభాస్ తో చేసిన రాధే శ్యామ్ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని చెప్పింది పూజ. అయితే ఈ సినిమా విడుదల తేదీ మాత్రం నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ ను అడగాలని తెలిపింది. అలాగే పూజ హెగ్డే మహేష్ తో రెండోసారి, త్రివిక్రమ్ తో మూడోసారి పనిచేయడం చాలా బాగుందని తెలిపింది. షూటింగ్ ఎప్పుడంటే మాత్రం నిర్మాణ సంస్థల యొక్క సోషల్ మీడియా హ్యాండిల్స్ ను అడగాలని తెలిపింది.
ఇంకా మెగాస్టార్ సినిమాలో వర్క్ చేయడం తన డ్రీమ్ అని, ఇంకా ఆచార్యకు సంబంధించి ఒక సాంగ్ ను పూర్తి చేయాలని తెలిపింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ లో కామెడీ రోల్ ను చేస్తున్నట్లు రివీల్ చేసింది.