
ప్రస్తుతం పూజ హెగ్డే హవా మాములుగా లేదు. టాలీవుడ్ లో యంగ్ హీరోలు అందరితో దాదాపుగా నటించేసిన పూజ హెగ్డే, టాప్ హీరోలతో సైతం కొందరితో నటించేసింది. చాలా త్వరగా టాలీవుడ్ లో టాప్ ప్లేస్ కు చేరుకుంది. ప్రస్తుతం వేరే భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న పూజ హెగ్డే, తెలుగు సినిమాలపై కూడా ఫోకస్ పెట్టింది.
ఈ భామ నటించిన రాధే శ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చిత్రాలు ఈ ఏడాది విడుదలవుతాయి. అలాగే తమిళ్ లో విజయ్ సరసన బీస్ట్, మరో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తోన్న పూజ తన రెమ్యునరేషన్ ను అమాంతం పెంచేసింది.
ప్రస్తుతం తన డిమాండ్ కు తగ్గట్లుగా పూజ హెగ్డే 3.5 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమెకు ఉన్న డిమాండ్ దృష్ట్యా నిర్మాతలు ఆ మొత్తం చెల్లించడానికి కూడా రెడీ అంటున్నారు. నితిన్ హీరోగా వక్కంతం వంశీలో తెరకెక్కబోయే చిత్రానికి ఈ రేటును డిమాండ్ చేసింది ఈ భామ.