
ప్రస్తుతం సౌత్ ఇండియాలో బిజీ హీరోయిన్ ఎవరంటే పూజ హెగ్డే అని చెప్పవచ్చు. ఇటీవలే రాధే శ్యామ్ షూటింగ్ ను మొదలుపెట్టింది పూజ. కొన్ని రోజులు రాధే శ్యామ్ షూటింగ్ లో పాల్గొన్నాక ఇప్పుడు తన బేస్ ను చెన్నైకు మార్చేసింది. ఇక్కడ పూజ తన తమిళ చిత్రాన్ని మొదలుపెట్టింది. విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న బీస్ట్ చిత్రంలో పూజ హీరోయిన్ గా నటిస్తోంది.
నెల్సన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈరోజు నుండి బీస్ట్ సాంగ్ షూటింగ్ మొదలైంది. విజయ్, పూజ హెగ్డేలపై ఒక సాంగ్ ను షూట్ చేస్తున్నారు. అది పూర్తవ్వగానే పూజ మళ్ళీ హైదరాబాద్ చేరుకుంటుంది. రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి బాలీవుడ్ చెక్కేస్తుంది. అక్కడ రెండు ప్రాజెక్టులను సైన్ చేసింది అమ్మడు.
ఇలా వరస చిత్రాలతో బిజీబిజీగా ఉంది అమ్మడు. పూజ హెగ్డే తెలుగులో రాధే శ్యామ్ కాకుండా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ చేస్తోంది. అలాగే ఆచార్యలో చిన్న పాత్రలో కనిపించనుంది.