Homeటాప్ స్టోరీస్నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?

నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?

నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?
నరేంద్ర మోదీ నుండి పిలుపు అందుకున్న చిరు.. ఉపాసన ఎఫెక్టేనా?

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగు వారు బానే ఆదరించారు. చిరంజీవి సైతం ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి తెగ కష్టపడుతున్నాడు. సినిమాకు వచ్చే లాభాల కంటే ఈ సినిమా ద్వారా వచ్చే గౌరవాన్నే ఎక్కువ కోరుకుంటున్నాడు చిరంజీవి. అందుకే ఈ చిత్రాన్ని రాజకీయ నాయకులకు చూపించడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళశై కు చూపించగా, ఆమె ఈ చిత్రాన్ని పొగిడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ను కూడా సినిమా చూడమని విజ్ఞప్తి చేయడానికి చిరు ఇటీవలే కలిసిన విషయం తెల్సిందే. ఆయన కూడా చూస్తానని సానుకూలంగా స్పందించారు. త్వరలోనే ఈ చిత్రాన్ని జగన్ చూసే అవకాశముంది.

వీటికి తోడు భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా సైరాను చూసి చిరంజీవి, చరణ్ ను కలిసి అభినందించారు. తెలుగువారి సత్తా మరోసారి ఈ చిత్రం ద్వారా తెలుస్తుందని కొనియాడారు. ఇక చిరంజీవి ఈ చిత్రాన్ని నరేంద్ర మోదీకి చూపించడానికి కూడా ప్రయత్నించాడు. గత వారం ఇందుకోసమే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా అది ఫలించలేదు. ప్రధానమంత్రి హర్యానా, మహారాష్ట్రలో ఎన్నికల సందర్భంగా ప్రచార పనుల్లో బిజీగా ఉండడంతో అపాయింట్మెంట్ ఇవ్వడం కుదర్లేదు.

- Advertisement -

అందుకే ప్రధానమంత్రి కార్యాలయం నుండి చిరంజీవి, రామ్ చరణ్ లకు కబురందింది. ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని వీరిద్దరూ కలవబోతున్నారు. ప్రచార కార్యక్రమాలు ముగియడంతో మర్చిపోకుండా చిరంజీవిని కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది సంతోషకర విషయంగా పరిగణిస్తున్నారు కొంత మంది. అయితే మరికొంత మంది దీనికి మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇటీవలే మహాత్మా గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా సినీ ప్రముఖులను కలిసిన నరేంద్ర మోదీ.. అందులో సౌత్ ఇండస్ట్రీకి ప్రాధాన్యత ఇవ్వలేదని చిరంజీవి కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన సోషల్ మీడియా వేదికగా విమర్శించిన సంగతి తెల్సిందే. సినీ ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ ఇండస్ట్రీ కూడా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. సౌత్ నుండి ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఒక్కరికే ఆహ్వానం అందిన విషయం తెల్సిందే. అయితే ఈ విషయంపై మోదీ మీద విమర్శలు పెరిగిపోతున్న నేపథ్యంలో నష్ట నివారణ చర్యలకు దిగిన మోదీ ఇప్పుడు చిరంజీవికి అపాయింట్మెంట్ ఇచ్చాడని అంటున్నారు.

సౌత్ ఇండస్ట్రీని గుర్తించే వ్యక్తి అయితే సినీ ఇండస్ట్రీని కలిసినప్పుడు సౌత్ నుండి కూడా ప్రాధాన్యత కల్పించవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నారు. మరి ఇదంతా ఉపాసన ఎఫెక్ట్ వల్లే జరిగిందా? లేక మోదీ గుర్తించుకుని చిరంజీవి, చరణ్ లకు ఆహ్వానం అందించారా అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All