HomeVideosపెళ్లి సందడి ట్రైలర్: పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పెళ్లి సందడి ట్రైలర్: పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

పెళ్లి సందడి ట్రైలర్: పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్
పెళ్లి సందడి ట్రైలర్: పెర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

ప్రముఖ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ నిర్మల కాన్వెంట్ చిత్రంలో నటించి అందరినీ మెప్పించిన విషయం తెల్సిందే. కొంత బ్రేక్ తర్వాత రోషన్ మరోసారి రీలాంచ్ అవుతున్నాడు. ఆ చిత్రం పెళ్లి సందడి. లెజండరీ దర్శకుడు కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సినిమా రూపొందుతోంది. గౌరీ రోణంకి పెళ్లి సందడి ద్వారా దర్శకురాలిగా పరిచయమవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు పెళ్లి సందడి ట్రైలర్ ను లాంచ్ చేయడం విశేషం. ఇక ట్రైలర్ విషయానికొస్తే ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఈ చిత్రం సాగనుంది. కామెడీ, ఎమోషన్స్, ఫైట్స్ అన్నీ కలగలిపి ట్రైలర్ ను సిద్ధం చేసారు. రోషన్ సరసన శ్రీలీలా హీరోయిన్ గా పరిచయమవుతోంది.

- Advertisement -

ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వం వహించాడు. రాఘవేంద్ర రావు ఈ చిత్రంలో స్పెషల్ రోల్ లో నటించడం విశేషం. దసరాకు పెళ్లి సందడి విడుదల కానుందని అధికారికంగా ప్రకటించారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All