Homeటాప్ స్టోరీస్పెళ్లి సందD: టాక్ డిజాస్టర్.. కలెక్షన్స్ హౌజ్ ఫుల్స్

పెళ్లి సందD: టాక్ డిజాస్టర్.. కలెక్షన్స్ హౌజ్ ఫుల్స్

పెళ్లి సందD: టాక్ డిజాస్టర్.. కలెక్షన్స్ హౌజ్ ఫుల్స్
పెళ్లి సందD: టాక్ డిజాస్టర్.. కలెక్షన్స్ హౌజ్ ఫుల్స్

శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రీలాంచ్ అయిన చిత్రం పెళ్లి సందD. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు పాతికేళ్ల క్రితం తీసిన క్లాసిక్ పెళ్లి సందడి చిత్ర టైటిల్ కు చిన్న విరుపు ఇచ్చి ఇప్పుడు పెళ్లి సందDగా రూపొందించారు. ఆ చిత్రంలో తండ్రి శ్రీకాంత్ హీరోగా నటిస్తే ఈ చిత్రంలో రోషన్ హీరోగా నటించింది. శ్రీలీల హీరోయిన్ గా చేసిన ఈ చిత్రానికి రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణతో పాటు నటనలో డెబ్యూ కూడా చేసాడు.

పెళ్లి సందD చిత్రానికి డిజాస్టర్ ఫస్ట్ టాక్ వచ్చింది. క్రిటిక్స్ అయితే ఈ చిత్రాన్ని చీల్చి చెండాడేసారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఈ చిత్రం కలెక్షన్స్ ను సాధిస్తోంది. మొదటి రోజు పెళ్లి సందD 1.61 కోట్ల షేర్ ను సాధించగా రెండో రోజు కూడా ఈ చిత్రానికి చాలా చోట్ల హౌజ్ ఫుల్స్ పడ్డాయి. వచ్చిన టాక్ కు, వస్తోన్న కలెక్షన్స్ కు సంబంధం లేకపోవడంతో చిత్ర టీమ్ కూడా ఆశ్చర్యంగా ఉంది.

- Advertisement -

పెళ్లి సందD చిత్రం హిట్ అనిపించుకోవాలంటే 7.5 కోట్ల షేర్ ను సాధించాల్సి ఉంది. చూస్తుంటే తొలి వీకెండ్ ఈ చిత్రానికి పాజిటివ్ గా ఉండనుంది కానీ హిట్ అనిపించుకోవాలంటే మాత్రం వీక్ డేస్ లో సస్టైన్ అవ్వాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All