
సీనియర్ హీరో శ్రీకాంత్ ముందు నుండీ కూడా క్యారెక్టర్ పాత్రలపై ఆసక్తి చూపిస్తూనే వచ్చాడు. తను హీరోగా చేస్తున్నప్పుడు కూడా మంచి క్యారెక్టర్ పాత్రలు పడితే చేసాడు. అయితే హీరోగా శ్రీకాంత్ కెరీర్ లో డౌన్ అయ్యి చాలా కాలమే అయింది. విలన్ గా చిత్రాలు చేయడానికి చూస్తున్నాడు. అప్పట్లో నాగ చైతన్య హీరోగా రూపొందిన యుద్ధం శరణం చిత్రంలో విలన్ గా నటించాడు కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ శ్రీకాంత్ వస్తున్నాడు. నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతోన్న అఖండలో కీలక పాత్ర చేసాడు శ్రీకాంత్. బోయపాటి శ్రీను ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాలో తన పాత్ర గురించి స్పందించాడు. “అఖండలో నేను చేస్తోంది విలన్ పాత్రే. చాలా భయంకరమైన విలన్ గా నటించాను.
నా లుక్ కచ్చితంగా అందరికీ షాకింగ్ గా ఉంటుంది. ముంబై నుండి డిజైన్స్ తెప్పించి అందులో ఒకటి సెలెక్ట్ చేసారు బోయపాటి. ఇలాంటి పాత్ర మళ్ళీ చెయ్యొద్దని సలహా ఇచ్చారు బాలయ్య గారు. ఆయనతో శ్రీరామ రాజ్యంలో తమ్ముడిగా నటించాను. ఇప్పుడు విలన్ గా చేస్తున్నాను. చాలా క్రూరమైన పాత్ర అది. నాకు చాలా మంచి పేరు తీసుకొస్తుంది. అవకాశాలు కూడా పెరుగుతాయి” అని శ్రీకాంత్ రివీల్ చేసాడు.