Homeటాప్ స్టోరీస్ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్`కు భారీ షాక్!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్`కు భారీ షాక్!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్`కు భారీ షాక్!
ప‌వ‌న్‌క‌ల్యాణ్ `వ‌కీల్ సాబ్`కు భారీ షాక్!

దాదాపు రెండేళ్ల విరామం త‌రువాత ప‌వ‌ర్‌స్టార్‌ ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌రోసారి కెమెరా ముందుకొచ్చారు. ఆయ‌న
న‌టిస్తున్న తాజా చిత్రం `వ‌కీల్‌సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ హిట్ ఫిల్మ్ `పింక్` ఆధారంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తున్నారు. బోనీ క‌పూర్‌తో క‌లిసి నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో ఈ సినిమా షూటింగ్‌ని నిర‌వ‌ధికంగా వాయిదా వేశారు.

ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ్డాక మ‌ళ్లీ షూటింగ్ పునః ప్రారంభించాలని, బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని పూర్తి చేసి చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓ వీడియో లీక్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ మూవీకి కోర్టు స‌న్నివేశాలు కీల‌కం. ఆ స‌న్నివేశాల‌ని చిత్ర బృందం ముందు షూట్ చేసింది. దానికి సంబంధించిన వీడియో, కీల‌కమైన‌ ఓ ఫొటో బ‌య‌టికి రావ‌డం చిత్ర బృందాన్ని షాక్‌కు గురిచేస్తోంది.

- Advertisement -

70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యిన ఈ చిత్రాన్ని ఓ వీఎఫ్ ఎక్స్ కంప‌నీకి పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కోసం చిత్ర బృందం అందించింది. వారి నుంచే కీల‌క స‌న్నివేశానికి సంబంధించిన వీడియో బ‌య‌టికి లీక్ కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. దీంతో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో వున్న బిగ్ మూవీస్‌కి సంబంధించిన ప్రొడ్యూస‌ర్స్‌, డైరెక్ట‌ర్స్ ఎక్క‌డ త‌మ సినిమాల‌కు సంబంధించిన వీడియోలు లీక్ అవుతాయోన‌ని భ‌య‌ప‌డుతున్నార‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All