Homeటాప్ స్టోరీస్ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజ‌మైన హీరో!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజ‌మైన హీరో!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజ‌మైన హీరో!
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజ‌మైన హీరో!

లాక్‌డౌన్ కార‌ణంగా సినిమా ఇండ‌స్ట్రీలోని షూటింగ్‌లు బంద్ కావ‌డంతో సెల‌బ్రిటీలంతా ఇంటికే ప‌రిమిత‌మైపోయారు. ఫ్యాన్స్‌తో ట‌చ్‌లో వుండ‌టం కోసం సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆస‌క్తిక‌ర‌మైన వీడియోలు, ఫొటోల‌తో ఆక‌ట్టుకుంటున్నారు. కొంత మంది సెల‌బ్రిటీలు ఫ్యాన్స్‌తో ఇంట‌రాక్ట్ అవుతున్నారు. తాజాగా `అందాల రాక్ష‌సి` లావ‌ణ్య త్రిపాఠి సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చ‌టించింది. ఇటీవ‌ల `అర్జున్ సుర‌వ‌రం` చిత్రంతో హిట్‌ని సొంతం చేసుకున్న లావ‌ణ్య ప్ర‌స్తుతం రెండు క్రేజీ చిత్రాల్లో న‌టిస్తోంది.

సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తున్న `ఏ 1 ఎక్స్‌ప్రెస్‌`, కార్తికేయ గుమ్మ‌కొండ‌తో బ‌న్నీవాసు నిర్మిస్తున్న `చావు క‌బురు చల్ల‌గా` చిత్రాల్లో న‌టిస్తోంది. ఈ సంద‌ర్భంగా అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు లావ‌ణ్య స‌మాధానాలు చెప్పింది. గ‌త 50 రోజుల‌కు పైగా క్వారెంటీన్ లో వుంటున్న లావ‌ణ్‌య ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా? ఎప్పుడు షూటిగ్‌ల‌కు వెళ్లాలా అని ఎదురుచూస్తోంద‌ట‌. స‌క్సెస్ మంత్ర అంటే ఏంటో త‌న‌కు తెలియ‌ద‌ని, నిన్ను నీ ధైర్యాన్ని న‌మ్ముకో.. క‌ళ‌ను క‌ళ‌గానే చూడాలి. పోటీలా చూడ‌కూడ‌దు అని ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా చెప్పింది.

- Advertisement -

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్‌తో క‌లిసి తొలిసారి `వ‌కీల్‌సాబ్‌` చిత్రంలో న‌టిస్తోంది లావ‌ణ్య‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న గురించి ఒక్క‌మాట‌లో చెప్పాల‌ని అడిగితే `అస‌మాన‌త‌ల‌కు ఎదురు నిల‌బ‌డి పోరాటం చేస్తున్న ఆయ‌న ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. ఆయ‌న నిజ‌మైన హీరో` అని చెప్పింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All