Homeటాప్ స్టోరీస్బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

pawan kalyan sensational comments on balakrishnaనందమూరి బాలకృష్ణ తుపాకీ తీసి కాల్పులు జరిపితే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కానీ మా అభిమానులు బైక్ ల సైలెన్సర్ లను తీసి నడిపిస్తుంటే మాత్రం చర్యలు తీసుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేసాడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ . 2004 లో బాలకృష్ణ తన ఇంట్లో నిర్మాత బెల్లంకొండ సురేష్ పై అలాగే సత్యనారాయణ చౌదరి పై కాల్పులు జరిపిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . కాగా ఆ కేసులో బాలయ్య పోలీస్ స్టేషన్ కు అలాగే కోర్టు మెట్లు ఎక్కాడు కట్ చేస్తే బాలయ్య మా పై కాల్పులు జరపలేదని సాక్ష్యం ఇచ్చారు బెల్లంకొండ సురేష్ , సత్యనారాయణ చౌదరి లు .

కట్ చేస్తే ఇన్నాళ్లకు ఆ సంఘటన ని గుర్తుకు తెస్తున్నాడు పవన్ కళ్యాణ్ . అయితే బాలయ్య పేరు నేరుగా చెప్పలేదు కానీ నా అభిమానులు సైలెన్సర్ తీసి వాహనాలు నడిపితే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు కానీ తుపాకీతో కాల్పులు జరిపిన వాళ్ళని మాత్రం వదిలేశారని , వాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని పరోక్షంగా బాలయ్య కాల్పుల ఉదంతాన్ని తెరపైకి తెచ్చాడు పవన్ . గతకొంత కాలంగా తెలుగుదేశం పార్టీ ని విమర్శిస్తున్న పవన్ తాజాగా బాలకృష్ణ పై సంచలన వ్యాఖ్యలు చేసి దుమారం రేపాడు ఇక బాలయ్య ఎలా స్పందిస్తాడో చూడాలి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల .

- Advertisement -

English Title: pawan kalyan sensational comments on balakrishna

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All