Homeటాప్ స్టోరీస్పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడా

పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడా

ys jagan satires on pawan kalyan marriagesనాలుగేళ్ళ కోసారి పెళ్లి చేసుకొని , ఆ తర్వాత విడాకులు ఇస్తూ ఇప్పటికే నలుగురి ని పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ రాజకీయాలు మాట్లాడటం విడ్డురంగా ఉందని , పైగా నన్ను విమర్శించడం మరీ దారుణంగా ఉందని పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల పై సంచలన వ్యాఖ్యలు చేసాడు ఆంధప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వై ఎస్ జగన్మోహన్ రెడ్డి . పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే . అయితే పవన్ కళ్యాణ్ నాలుగు పెళ్లిళ్లు కూడా చేసుకున్నాడని జగన్ ఆరోపించడం సంచలనంగా మారింది .

గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కి బిజెపి కి మద్దతు ఇచ్చి అనుభవజ్ఞుడైన చంద్రబాబు అధికారంలోకి వస్తేనే ఆంధ్రప్రదేశ్ కు మంచిదని చెప్పిన నువ్ నాలుగేళ్ళ తర్వాత టిడిపి అవినీతిలో కూరుకుపోయిందని అంటూనే నాపై విమర్శలు చేయడం ఏంటి ? అంటే పరోక్షంగా మళ్ళీ తెలుగుదేశం కు మేలు చేసే ప్రక్రియ చేస్తున్నావని తీవ్ర ఆరోపణలు చేసాడు జగన్ . పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్ల గోల గతకొంత కాలంగా నానుతూనే ఉంది అయితే ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో మళ్ళీ ఈ పెళ్లిళ్ల గోల మరీ ఎక్కువ అవ్వడం ఖాయం . ఇక తెలుగుదేశం పార్టీ కూడా పవన్ మూడు పెళ్లిళ్ల గురించి పెద్ద ఎత్తన విమర్శించడం ఖాయంగా కనిపిస్తోంది . మొత్తానికి జనసేన అంటూ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు మిగతా రాజకీయాల పార్టీ ల వాళ్ళు చుక్కలు చూపిస్తున్నారు ఘాటు విమర్శలు చేస్తూ .

- Advertisement -

English Title: ys jagan satires on pawan kalyan marriages

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All