
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయంపై అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. తమ హీరోను మళ్ళీ పెద్ద తెర మీద చూసుకోవచ్చన్న ఆనందంలో తేలిపోతున్నారు. పవన్ సినిమాల పరంగా కూడా దూకుడు పెంచడం వారిని మరింత సంతోషపెడుతోంది. అయితే పవన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వడం పట్ల ఎంత మంది సంతోషంగా ఉన్నారో అంతమంది అసహనంగా కూడా ఉన్నారు. ఆ లిస్ట్ లో మాజీ జేడీ లక్ష్మి నారాయణ కూడా ఉన్నారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఎన్నికలకు ముందు ఆ పార్టీలో చేరిన లక్ష్మీనారాయణకు పవన్ కళ్యాణ్ ఘనస్వాగతం అందించారు. వైజాగ్ ఎంపీ స్థానానికి టికెట్ ఇచ్చి పోటీకి నిలబెట్టారు. అయితే ఆ ఎన్నికల్లో లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్ ఓడిపోయినా వారి మధ్య ఎప్పుడూ సఖ్యత ఉండేది. ఎన్నికల తర్వాత జరిగిన ఎన్నో కార్యక్రమాలకు మీటింగులకు ఇద్దరూ కలిసి పాల్గొనేవారు. ఐతే ఉన్నట్టుండి నిన్న సడెన్ గా లక్ష్మీనారాయణ పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించి జనసైనికులకు షాక్ ఇచ్చారు. పవన్ సినిమాల్లోకి తిరిగి వెళ్లను అన్నాడని తిరిగి ఇప్పుడు మళ్ళీ నటిస్తుండడంతో తన విధి విధానాల్లో నిలకడ లేనట్లుగా అనిపిస్తోందని ప్రకటించి తన రాజీనామా విషయాన్ని స్పష్టం చేసాడు.
అయితే రాజీనామా చేయడం ఓకే కానీ దానికి చెప్పిన కారణం సరిగా లేదంటూ జనసైనికులు విమర్శించడం మొదలుపెట్టారు. ఈ విషయంపై జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ త్వరగానే స్పందించారు. చాలా హుందాగా కూడా ప్రవర్తించి అందరినీ మెప్పించారు. తనకు అందరిలా ఫ్యాక్టరీలు లేవని, పార్టీ మనుగడకు, తన కుటుంబానికి, తనని నమ్ముకున్నవాళ్లకు న్యాయం చేయడం కోసం తాను సినిమాల్లో నటించక తప్పదని, తనకు తెలిసింది ఇదొక్కటే అని స్పందించారు పవన్. అయినా తనకు లక్ష్మీనారాయణ అంటే చాలా గౌరవం ఉందని ఆయనకు శుభాభినందనలు తెలిపారు.
లక్ష్మీనారాయణ గారి భావాలను గౌరవిస్తున్నాము – JanaSena Chief @PawanKalyan pic.twitter.com/iBJJ4JX0KC
— JanaSena Party (@JanaSenaParty) January 30, 2020
Credit: Twitter