Homeటాప్ స్టోరీస్మరో సినిమాను మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్

మరో సినిమాను మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్

మరో సినిమాను మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్
మరో సినిమాను మొదలుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడంటే అది పింక్ రీమేక్ వల్లే సాధ్యమైందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు ఎక్కువ రోజులు కాల్ షీట్స్ అవసరం లేదు. పెద్దగా ఫైట్లు, డ్యాన్స్ లతో పని ఉండదు. ఈ నేపథ్యంలో పింక్ రీమేక్ కాబట్టే సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని అంతా అనుకున్నారు. ఇటీవలే పింక్ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాడు పవన్. మధ్యాహ్నం దాకా షూటింగ్ చేస్తూ తర్వాత రాజకీయాలు చూసుకుంటూ చాలా బిజీగా గడుపుతున్నాడు.

ఉన్న షెడ్యూల్స్ తోనే ఫుల్ బిజీ అంటే ఇప్పుడు పవన్ మరో బాధ్యతను ఎత్తుకుంటున్నాడు. ఈరోజే పవన్ కళ్యాణ్ తన కొత్త సినిమా షూటింగ్ ను మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. క్రిష్ తో చేయబోతున్న ఈ సినిమా జానపద నేపథ్యంలో సాగే ఒక పీరియాడిక్ సినిమాగా తెలుస్తోంది. క్రిష్ చెప్పిన కథకు ఫిదా అయిన పవన్, ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాడట. వీలైనంత త్వరగా పింక్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి క్రిష్ సినిమా పనులను మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ ను కంగారుగా కాకుండా పవన్ రాజకీయాల షెడ్యూల్ ను బట్టి జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే సంక్రాంతికి కానీ వేసవికి కానీ ఈ సినిమాను విడుదల చేసేలా ఎక్కువ గ్యాప్ తీసుకుని ఎక్కువ వర్కింగ్ డేస్ తో షూటింగ్ ను చేయబోతున్నారు.

- Advertisement -

ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించనుండగా కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ సినిమా కోసం బాలీవుడ్ భామను దించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All