Homeటాప్ స్టోరీస్పాన్ ఇండియా సెట్‌లోకి ప‌వ‌ర్‌స్టార్‌!

పాన్ ఇండియా సెట్‌లోకి ప‌వ‌ర్‌స్టార్‌!

Pawan Kalyan entered krish pan india movie sets
Pawan Kalyan entered krish pan india movie sets

క్రేజీ హీరో ప‌వ‌న్‌కున్నడిమాండ్ ఎంత‌? ఆయ‌న రేంజ్ ఎంత‌? అని రెండేళ్ల విరామం త‌రువాత సినిమా చేస్తున్నారు కాబ‌ట్టి ఆ క్రేజ్‌లోఏమైనా తేడా వ‌చ్చిందా? అని ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు కూడా అనుమానంగా చూశాయి. అయితే ఇటీవ‌ల విడుద‌లైన `వ‌కీల్ సాబ్‌` ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్‌, మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా రిలీజ్ చేసిన లిరిక‌ల్ వీడియో సాంగ్‌కు వ‌చ్చిన క్రేజ్‌ని చూశాక ప‌వ‌ర్‌స్టార్ క్రేజ్ లో ఏ మాత్రం ప‌వ‌ర్ త‌గ్గ‌లేద‌ని ఇండ‌స్ట్రీ అంత‌టికీ పిచ్చ క్లారిటీ వ‌చ్చేసింది.

దీంతో ప‌వ‌న్ న‌టిస్తున్న `వ‌కీల్ సాబ్‌` రిలీజ్ కోసం వేయి క‌ళ్ల‌తో అంతా ఎదురుచూస్తున్నారు. ప‌వ‌ర్‌ఫుల్ లాయ‌ర్‌గా ప‌వ‌న్ న‌టిస్తున్న ఈ చిత్రాన్ని మే 15న రిలీజ్ చేయాల‌ని ప్రొడ్యూస‌ర్స్ దిల్ రాజు, బోనీ క‌పూర్ ఫిక్స్ అయిన‌ట్టు తాజా స‌మాచారం. `వ‌కీల్‌సాబ్‌`ని సైలెంట్‌గా మొద‌లుపెట్టి సాధ్య‌మైనంత వ‌ర‌కు పూర్తి చేసిన ప‌వ‌న్‌క‌ల్యాణ్ తాజాగా క్రిష్ సినిమా సెట్‌లోకి ఎంట‌ర‌య్యార‌ట‌.

- Advertisement -

క్రిష్ డైరెక్ష‌న్‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఏ.ఎం. ర‌త్నం అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న పిరియాడిక్ డ్రామా సెట్‌లోకి ఇటీవ‌లే ఎంట‌రైన ప‌వ‌న్ ఈ చిత్ర షూటింగ్‌లో ఈ నెల 12 వ‌ర‌కు పాల్గొంటార‌ట. 14న జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ కార్య‌క్ర‌మం వుంది కాబ‌ట్టి ఆరోజు ప‌వ‌న్ పార్టీ కార్యాల‌యంలోనే గ‌డుపుతార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All