Tuesday, August 16, 2022
Homeటాప్ స్టోరీస్`వ‌కీల్‌సాబ్‌` కోసం టెర్రిఫిక్ సాంగ్ రెడీ!

`వ‌కీల్‌సాబ్‌` కోసం టెర్రిఫిక్ సాంగ్ రెడీ!

vakeel saab on more magical on the way
vakeel saab on more magical on the way

ప‌వ‌ర్‌స్టార్ ప‌వన్‌క‌ల్యాణ్ న‌టిస్తున్న తాజా చిత్రానికి `వ‌కీల్ సాబ్` అనే టైటిల్‌ని ఖ‌రారు చేయ‌డం, ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేయ‌డంతో ఫ్యాన్స్ సంబ‌రాలు చేసుకుంటున్నారు. శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్‌లుక్ ట్విట్ట‌ర్‌లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి ఈ మ‌ధ్య కాలంలో ఈ స్థాయిలో ట్రెండ్ అయిన సినిమాగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. స్వ‌యంగా సోష‌ల్ మీడియా వ‌ర్గాలే ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించ‌డంతో ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

- Advertisement -

ఇదిలా వుంటే ప‌వ‌న్ ఫ్యాన్స్‌కి `వ‌కీల్ సాబ్` టీమ్ మ‌రో గుడ్ న్యూస్‌ని వినిపించ‌డానికి రంగం సిద్ధం చేస్తోంది. త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ సింగిల్‌ని రిలీజ్ చేయ‌బోతోంది. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రం కోసం రామ‌జోగ‌య్య శాస్త్రి రాసిన `బుట్ట‌బొమ్మ సాంగ్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికి తెలిసిందే. ఇంత‌కు మించిన ప‌దాల‌తో `వ‌కీల్ సాబ్` కోసం రామ‌జోగ‌య్య‌శాస్త్రి మ్యాజిక్ చేశార‌ట‌. ఈ పాట‌ని విన్న మాట‌ల మాంత్రికుడు కితాబిచ్చార‌ని స్వ‌యంగా రామ‌జోగ‌య్య‌శాస్త్రి సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించ‌డంతో ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ సంబ‌ర‌పడిపోతున్నారు.

`త్రివిక్ర‌మ్‌గారు నిన్న ఒక పాట వింటూ ఇది రామ్ జోది క‌దా అంటూ గుర్తు ప‌ట్టార‌ట‌. నిలిచిపోయే పాట అవుతుంద‌న్నార‌ట‌ సంతోషం అనిపించింది` అని రామ‌జోగ‌య్య‌శాస్త్రి ట్వీట్ చేశారు. ఈ పాట‌ని ఎప్పుడెప్పుడు వినాలా అని ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నార‌ట‌.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts