Homeటాప్ స్టోరీస్సరిలేరు...కి “చిరు” – అల వైకుంఠపురానికి “పవన్”

సరిలేరు…కి “చిరు” – అల వైకుంఠపురానికి “పవన్”

Pawan kalyan chief guest for Ala.. vaikunthapurramlo
Pawan kalyan chief guest for Ala.. vaikunthapurramlo

ఇలా గనక జరిగితే సంక్రాంతికి బాక్సాఫీస్ సాక్షిగా అన్నదమ్ముల సవాల్ అవుతుంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాల మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. రెండు పాటలు రిలీజ్ చేసి 200 మిలియన్ వ్యూస్ కొట్టిన బన్నీ – గురూజీ కాంబో నే ప్రస్తుతం లీడింగ్ లో ఉంది. తమన్నా, విజయశాంతి, రాజేంద్రప్రసాద్, రష్మిక సోలో సాంగ్ ఇలా ఎన్ని ప్రయత్నాలు చెయ్యాలో అన్నీ చేసి దిల్ రాజు క్రియేటివ్ టీం కష్టపడుతోంది. ఇక ఈ మధ్యనే దిల్ రాజు & మహేష్ బాబు స్వయంగా వెళ్లి చిరుని కలిసి ప్రీ రిలీజ్ గెస్ట్ గా ఫైనల్ చేసుకుని,ల్యాండ్ మార్క్ అనౌన్స్ మెంట్ అంటూ హైప్ ని నెక్స్ట్ లెవల్  కి తీసుకెళ్ళారు.

ఇక అల… వైకుంఠపురం టీం సైలెంట్ గా ఉండటంతో అందరికీ పవన్ కళ్యాణ్ తన మిత్రుడు కి సప్పోర్ట్ ఇస్తాడని కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే గతంలో కూడా పవన్ జులాయి మూవీ రిలీజ్ కి గెస్ట్ గా వచ్చి, బన్నీ కి, గురూజీ కి సపోర్ట్ చేసాడు. ఇక హారిక – హాసిని బ్యానర్ కి పవన్ ఒక సినిమా బాకీ ఉన్నాడు. కాబట్టి ఫైనల్ గా, జనవరి 6 యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగే అల.. వైకుంఠపురం ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా వస్తాడని; పైకి చెప్పకపోయినా, ఆ టైం కి ఏ ఇబ్బంది రాకుండా ప్లానింగ్ లో ఉన్నారు.

- Advertisement -

వాళ్ళు అయినా, వీళ్ళు అయినా, మన దగ్గరికే వస్తున్నారు అని మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All