Homeటాప్ స్టోరీస్కొరటాల సినిమాకు చిరు లుక్ అదిరిపోయింది అంటున్నారే!

కొరటాల సినిమాకు చిరు లుక్ అదిరిపోయింది అంటున్నారే!

కొరటాల సినిమాకు చిరు లుక్ అదిరిపోయింది అంటున్నారే!
కొరటాల సినిమాకు చిరు లుక్ అదిరిపోయింది అంటున్నారే!

ఈ ఏడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో మన ముందుకు వచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ఫలితం సంగతి పక్కనపెడితే ఈ సినిమా చేసినందుకు, తన 12 ఏళ్ల కల తీరినందుకు సూపర్ హ్యాపీగా ఉన్నాడు మెగాస్టార్. ఈ నేపథ్యంలో చిరంజీవి తన తర్వాతి సినిమాకు సన్నద్ధమవుతున్న విషయం తెల్సిందే. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి తన తర్వాతి చిత్రాన్ని చేయబోతున్నాడు. వరసగా నాలుగు బ్లాక్ బస్టర్లు అందించిన కొరటాల శివ ఇప్పుడు టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్స్ లో ఒకడు. కమర్షియల్ సినిమాకు సామాజిక బాధ్యతను అద్ది సినిమా తీయడం కొరటాల స్పెషలిటీ. చిరంజీవితో చేయబోయే సినిమా కోసం కూడా ఇలాంటి ఒక సబ్జెక్ట్ నే ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చాలా స్పెషల్ గా ఉండాలని అటు కొరటాల శివ ఇటు చిరంజీవి పూర్తిగా కసరత్తులు చేసినట్లు తెలుస్తోంది. కొరటాల శివ స్క్రిప్ట్ పరంగా చేస్తే, చిరంజీవి తన లుక్ ను బెటర్ చేయడం కోసం జిమ్ లో చెమటలు చిందించినట్లు సమాచారం. రీసెంట్ గా ఈ సినిమాలో చిరంజీవి లుక్ కు సంబంధించి టెస్ట్ షూట్ కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఈ టెస్ట్ షూట్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్న కొరటాల శివ రెగ్యులర్ షూటింగ్ ను జనవరి 3 నుండి మొదలుపెట్టాలని నిర్ణయించాడు. ఈ మేరకు షెడ్యూల్ ను ఫిక్స్ చేసారు. ఇందులో చిరంజీవి ఇంట్రో సీన్స్ తో పాటు, ఇంట్రడక్షన్ సాంగ్ ను కూడా షూట్ చేస్తారట. సంక్రాంతికి బ్రేక్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఉంటుందని తెలుస్తోంది. మణిశర్మ ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తోన్న విషయం తెల్సిందే. ఇప్పటికే మణిశర్మ ఈ సినిమాకు మూడు సాంగ్స్ ను ఫైనల్ చేశారట. కొరటాల శివ-మణిశర్మతో పనిచేయడం ఇదే తొలిసారి కావడం విశేషం.

- Advertisement -

త్రిష ఈ చిత్రంలో కథానాయికగా ఎంపికైనట్లు తెలుస్తోంది కానీ అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ఇండిపెండెన్స్ డే వీక్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను షూట్ ప్రారంభం రోజు ప్రకటిస్తారని తెలుస్తోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All