Homeటాప్ స్టోరీస్తెలంగాణలో పోటీ అంటే భయపడుతున్న పవన్

తెలంగాణలో పోటీ అంటే భయపడుతున్న పవన్

Pawan kalyan afraid of kcrజనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కానీ అనధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి కి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది . ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చాను అంటూ చంద్రబాబు పై ప్రశ్నల వర్షం కురిపిస్తూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న పవన్ కేసిఆర్ ని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు . అంతేకాదు తెలంగాణలో జనసేన పోటీ చేయడం లేదు పైగా కేసిఆర్ కు పరోక్షంగా మద్దతు కూడా ప్రకటిస్తున్నాడు . రెండేళ్ళ క్రితం వరకు అలాగే 2014 ఎన్నికల్లో కేసిఆర్ తాట తీస్తా అంటూ కేసిఆర్ ని మాత్రమే కాకుండా కవిత ని కేటిఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు పవన్ . అంతెందుకు తను హీరోగా నటించిన ” కెమెరామెన్ గంగతో రాంబాబు ” చిత్రంలో ఏకంగా కేసిఆర్ , కేటిఆర్ , కవిత లను విలన్లుగా చూపించాడు పవన్ .

కట్ చేస్తే 2018 లో ఎన్నికలు రాగానే ప్రశ్నిస్తా అన్న గొంతు మూగ బోయింది . పక్క రాష్ట్రంలో చంద్రబాబు ని మాత్రం తూర్పార బడుతున్నాడు పవన్ . అక్కడ ప్రశ్నిస్తున్న గొంతు ఇక్కడ మాత్రం మూగబోయింది ఎందుకో ! మతలబు ఏంటో ? లోగుట్టు పెరుమాళ్ళ కెరుక ! రాజకీయ పార్టీ అంటే కనీసం కొన్ని స్థానాల్లోనైనా పోటీ చేయాలి కానీ ఇక్కడ పోటీ అంటే నిలువెల్లా భయపడిపోతున్నాడు , కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తాడట . ఇలా ఉంది పవన్ కళ్యాణ్ వ్యవహారం .

- Advertisement -

English Title: Pawan kalyan afraid of kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All