Homeటాప్ స్టోరీస్కేసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందట

కేసిఆర్ కు ఓటమి భయం పట్టుకుందట

Is KCR quit from Gajwel తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి ఓటమి భయం పట్టుకుందని అందుకే గజ్వేల్ లో పోటీ చేయకుండా సురక్షిత స్థావరమైన సిద్ధిపేట నుండి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేసిఆర్ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది . గజ్వేల్ లో గత ఎన్నికల సందర్భంగా పోటీ చేసి గెలుపొందాడు కేసిఆర్ , అయితే ముఖ్యమంత్రి అయినప్పటికీ అనుకున్న స్థాయిలో అక్కడ అభివృద్ధి జరగలేదు దానికి తోడూ కేసిఆర్ పై పోటీ చేస్తోంది ఒంటేరు ప్రతాప్ రెడ్డి . తెలుగుదేశం పార్టీ వ్యక్తీ అయినప్పటికీ కాంగ్రెస్ తీర్దం పుచ్చుకున్నాడు ఒంటేరు . గజ్వేల్ లో ఒంటేరు ప్రతాప్ రెడ్డి కి వ్యక్తిగత ఇమేజ్ ఉంది అలాగే కేసిఆర్ లాగే ఒంటేరు కూడా మంచి మాటకారి ,తూటకారి కూడా .

కాంగ్రెస్ – టిడిపి సంయుక్త అభ్యర్ధిగా ఒంటేరు పోటీ చేస్తుండటం ఒక కారణమైతే , ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉండటం కూడా మరో కారణం . ఈ రెండు కారణాలతో గజ్వేల్ లో పోటీ చేయకుండా సిద్ధిపేట నుండి పోటీ చేయాలనీ ఆలోచన చేస్తున్నాడట కేసిఆర్ . ఇటీవల నిర్వహించిన సర్వేలో కేసిఆర్ గ్రాఫ్ గణనీయంగా పడిపోవడంతో గజ్వేల్ లో పోటీకి భయపడుతున్నాడట . అందుకే సిద్ధిపేట నుండి పోటీ చేస్తాడని వినిపిస్తోంది . ఇంతకుముందు కేసిఆర్ సిద్ధిపేట నుండి పలుమార్లు పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే .

- Advertisement -

English Title: Is KCR quit from Gajwel

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All